భద్రాచలం ఆలయంలో విమానం వెళ్తున్నట్టు వింత శబ్దాలు.. భయపడుతున్న భక్తులు

భద్రాచలం ఆలయంలో విమానం వెళ్తున్నట్టు వింత శబ్దాలు.. భయపడుతున్న భక్తులు
  • ఆలయ తూర్పు మెట్ల వైపు నుంచి శబ్దాలు
  • ఎక్కడి నుంచి వస్తుందో తెలియక భక్తుల్లో అయోమయం
  • నీటిని సరఫరా చేసే పైపుల మధ్య గాలి ఒత్తిడి పెరగడం వల్లే కావొచ్చని అనుమానం
  • కొట్టిపడేస్తున్న భక్తులు

భద్రాద్రి ఆలయంలో వస్తున్న వింత శబ్దాలు భక్తులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఆలయ తూర్పు మెట్లవైపు నుంచి విమానం వెళ్తున్నట్టుగా శబ్దం వస్తోంది. అయితే, అది ఎక్కడి నుంచి వస్తోందో తెలియక భక్తులు భయపడుతున్నారు.

తూర్పు మెట్ల సమీపంలో ఉన్న జలప్రసాదానికి నీరు సరఫరా చేసే క్రమంలో పైపుల మధ్య గాలి ఒత్తిడి పెరగడం వల్ల ఇలా శబ్దం వస్తుండవచ్చని కొందరు చెబుతున్నారు. అయితే, ఇలా నీటిని సరఫరా చేయడం కొత్తకాదు కదా? అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఇది నిరంతర ప్రక్రియేనని చెబుతున్నారు. ఆలయ అధికారులు వెంటనే ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తోందో కనుక్కొని నివారించాలని భక్తులు కోరుతున్నారు.