Agniban rocket launch - అగ్నిబాణ్‌ రాకెట్ ప్రయోగం సక్సెస్‌...

Agniban rocket launch - అగ్నిబాణ్‌ రాకెట్ ప్రయోగం సక్సెస్‌...

ముద్ర,సెంట్రల్ డెస్క్:-అగ్నిబాణ్‌ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌) నుంచి ప్రైవేట్ రాకెట్ అగ్నిబాణ్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ప్రెవేట్ రాకెట్ ప్రయోగ వేదికపై నుంచి ఉదయం 7 గంటల 15 నిమిషాలకు అగ్నిబాన్ రాకెట్ ప్రయోగం చేశారు.

ఈ ప్రయోగం విజయంతో ప్రెవేటు రాకెట్ ప్రయోగాల పరంపర మొదలైందని ఇస్రో అధికారులు తెలిపారు. భవిష్యత్లో 300 కిలోల లోపు చిన్న తరహా ఉపగ్రహాలను లోఎర్త్ ఆర్బిట్లో ప్రవేశపెట్టడానికి ఈ తరహా ప్రయోగం చేప్టటింది ఇస్రో. కాగా, ప్రైవేటు స్టార్టప్‌ కంపెనీ అగ్నికుల్‌ కాస్మోస్‌ ఈ రాకెట్‌ను రూపొందించింది. దేశంలోనే తొలి సెమీ క్రయోజనిక్ ఇంజిన్ ఆధారిత రాకెట్‌గా ఇది రికార్డులకెక్కింది. కాగా ఇప్పటికే 3సార్లు వాయిదా పడిన ఈ రాకెట్ ప్రయోగం ఎట్టకేలకు విజయవంతమైంది.మూడేళ్ల క్రితం డీఆర్‌డీఓ.. తొలి తరం రుద్రమ్ మిసైల్‌ను పరీక్షించింది. రేడియేషన్ వెలువరించే వ్యవస్థలను ఈ మిసైల్ గుర్తించి, నిర్వీర్యం చేస్తుందని డీఆర్‌డీఓ పేర్కొంది. రుద్రమ్ పరీక్ష విజయవంతం కావడంపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఇదో అద్భుత విజయమని వ్యాఖ్యానించారు.