వ్యవసాయాన్ని వాణిజ్య పరిశ్రమగా పరిగణించాలి!!

వ్యవసాయాన్ని వాణిజ్య పరిశ్రమగా పరిగణించాలి!!
ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగానికి పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఎందుకు పనికిరాని వ్యవస్థగా  ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలను బట్టి తెలుస్తుంది! ఒకప్పుడు దేశంలో అన్నమో రామచంద్ర అన్న నినాదాలు వినబడుతున్న తరుణంలో రైతులు వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నమ్ముకొని బలోపేతం చేసి దేశంలో మిగులు ఉత్పత్తులు చేపట్టే స్థాయికి తీసుకువచ్చిన రైతన్నను ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు! పెట్టిన పెట్టుబడి సగానికి సగం కూడా దక్కని స్థితిలో నేడు వ్యవసాయరంగం కొట్టుమిట్టాడుతోంది.
1. గతంలో వివిధ పంటలకు సంబంధించి ఎన్నో రకాల చిరుధాన్యాల పంటలను రైతులు సాగు చేసి పండించేవారు. రైతుకు ఉన్న కొన్ని పార్టీ భూమిలో వేరువేరు రకాల పంటలు పండించేవారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు కూడా తమ పంటల విధానాన్ని మార్చడం జరిగిందని చెప్పవచ్చు. దీనితో పంటల వైవిధ్యం దెబ్బతింది. పూర్వకాలం నుండి సాంప్రదాయబద్ధంగా పండిస్తున్న పంటలు నేడు ఏ గ్రామానికి వెళ్లి చూసినా కనపడడం లేదు. పూర్తిగా కనుమరుగైపోయాయి. ప్రస్తుతం దేశీయంగా వరి గోధుమ, మిర్చి, సోయా చిక్కుడు, పసుపు, అల్లం, పత్తి ఇతరత్రా వాణిజ్య పంటలను పండించుతున్నారు. దీని ఫలితంగా ప్రజలకు రోజు ఆహారంగా ఉపయోగపడే చిరుధాన్యాలు, పప్పు దినుసులు కొరత ఏర్పడుతుంది.1900 సంవత్సరం మొదలుకొని వైవిధ్యానికి 75% మేరా నష్టం వాటిల్లుతున్నట్టు ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ( ఎఫ్ఈఓ) వెల్లడించింది. మానవులు తినే మొత్తం ఆహారంలో 60 శాతం ప్రస్తుతం 3 రకాల పంటలు నుంచి ఉత్పత్తి అవుతుంది. థాయిలాండ్ లో గతంలో 16 వేల వరి రకాలు ఉండేది. నేడు వాటి సంఖ్య 37 పడిపోయింది. ఇదే తంతు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో అమలు జరగబోతున్న ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ వెల్లడి చేసింది. భారతదేశంలో ఆంగ్లేయుల పాలన కాలంలో పంట వైవిద్యం దెబ్బ దెబ్బతింది. బ్రిటిష్ పరిపాలన కాలం కేవలం వాణిక్య పంటల పట్ల ముగ్గు చూపేవారు దీని ద్వారా దేశంలో ఆహార కొరత ఆకలి చావులు సంభవించినప్పటికీ రైతులపై ఒత్తిడి తీసుకురావడం, సాంప్రదాయక పంటలను పండించకుండా కట్టెదిట్టమైన చర్యలు చేపట్టడం వల్ల చాలామంది రైతులు బ్రిటిష్ ప్రభుత్వానికి తాళంకి రబ్బరు, నీలి మందు పంటలను పండించడానికి ముందుకు రావడం జరిగింది. దీని ద్వారా అప్పుడు “చంపారణ్ రైతు ఉద్యమం” బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమించిన చరిత్ర నిలువుటద్దం! 1960లో వచ్చిన హరిత విప్లవం దేశానికి ఆహార భద్రతను అందించింది. అదే సమయంలో స్థానిక పంటల వైవిధ్యానికి నష్టం వాటిల్లింది.2018 19 నాటికి పంజాబ్ మొత్తం పంట విస్తీర్ణంలో వరి గోధుమ వాటా 84.6% ఇది 1960-61 లో 32 శాతమే గోధుమపరి అధికంగా పండించడం వల్ల పప్పు ధాన్యాలు, మొక్కజొన్న జొన్న సెనగ కంది ఆవాలు పొద్దు తిరుగుడు వేరుశనగ చెరుకు తదితర పంటల సాగు గణనీయంగా తగ్గింది. పంటల వైవిధ్యం తగ్గడంతో ఐరన్ ప్రోటీన్ అధికంగా ఉండే వారికి రకాలను తమిళనాడు కోల్పోయింది. వరదలను తట్టుకోగల కట్టు యానం వంటి రకాలు ఉప్పు చార నెలలో సైతం పండేవి అవి దాదాపు అంతరించిపోయాయి.1970 వరకు ఇండియాలో లక్షకు పైగా వరి రకాలు ఉండేవి. పంట వైభవ్ దెబ్బ తినడంతో అవి ప్రస్తుతం ఆరు వేలకు పడిపోయాయి.1960 నుంచి 2010 మధ్యకాలంలో కేరళలో సాంప్రదాయ వరి రకాలు 70 శాతం దాకా క్షీణించాయి. వ్యవసాయంలో పంటల వైవిధ్యం కీలక విధానం. ఇది క్రమంగా క్షమించడంపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామం ఆహార భద్రతకు గొడ్డలిపెట్టుగా మారుతుందని హెచ్చరిస్తున్నారు.
2. వ్యవసాయ పంటల వైవిధ్యం నేల ఆరోగ్యం నాణ్యతను మెరుగుపరుస్తుంది. చీడపీడలను తగ్గిస్తుంది రసాయనక ఎరువులు కలుపు నివారణ మందులు క్రిమిసంహారక రకాలపై అధికంగా ఆధారపడ్డ విధానాన్ని తగ్గిస్తుంది. జాతీయ నేల సర్వే భూ వినియోగ ప్రణాళిక సంస్థ గతంలో దేశంలో పంటల వైవిధ్య విధానాన్ని స్పష్టంగా పేర్కొంది. పంటల వైవిధ్యాన్ని పెంచడం వల్ల వాతావరణ సంక్షోభాలను తట్టుకునేలా వ్యవసాయాన్ని తీర్చిదిద్దగలమని నిపుణులు సూచిస్తున్నారు ఈ క్రమంలో పంట వైవిధ్యాన్ని పెంచడానికి ప్రభుత్వాలు సరైన ప్రణాళిక రూపొందించి వాటిని పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది!.
వ్యవసాయ పంటలు క్షమించడం
2.ఎంతటి మహారాజు అయినా నాలుగు ముద్దలు నోట్లోకి పోకపోతే బ్రతికే స్థాయి ఉండదు. కాబట్టి ప్రపంచ మానవాళికి తిండి పెట్టే రైతన్నను కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి ప్రభుత్వాలు పైనే ఉందని చెప్పాలి! “తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలవాడేను మనిషోయ్” అన్నాడు మహాకవి గురజాడ! ఆ రోజుల్లోనే అంత ఆలోచనతో ఏ జీవికైనా తిండి అంత అవసరమా అని పేర్కొన్న మాటలను బట్టి చూస్తే బ్రతకడానికి ఆహారం ఎంత అవసరమో చెప్పవచ్చు. నేడు ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయం సాయం లేని సంస్థగా ఆకాశంలో తేలియాడుతున్నది. ప్రస్తుతం భారతదేశంలో రైతులు ఆరుగాలం కష్టానికి గిట్టుబాటు ధర లభించక వ్యవసాయరంగాన్ని నిర్లక్ష్యం చేశారు నిరాసక్తత రైతుల్లో నెలకొంటుంది. ఇదే జరిగితే భవిష్యత్తులో ఆహార కొరత మళ్లీ ఏర్పడే ప్రమాదం లేకపోలేదు. సేద్యం పై భరోసా కోల్పోతారు అంగడి గమనం ధరల స్థితిగతులు సరఫరా గిరాకి వ్యత్యాసాలను తెలుసుకునే తెలివితేటలు మన రైతన్నకు లేదు. ఈ కారణంగానే తాను పండించిన పంట కు తానే ధర నిర్ణయించుకోలేని నిస్సహాయ స్థితిలో రైతుకు కూరుకుపోయినాడు. ఈ పరిస్థితులను అధిగమించి వ్యవసాయ రంగాన్ని పరిశ్రమల లో భాగంగా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంకుర పరిశ్రమల ఏర్పాటుతో అత్యాధునిక సాంకేతిక అందుబాటులోకి వస్తున్న ఈ తరుణంలో రైతుల్లో ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పడి ఒక నిర్ణయాత్మకమైన నిర్ణయం తీసుకుని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. భూమిని నమ్ముకొని బతుకుతున్న సంఘటితంగా ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైతు ఉత్పత్తి స్థానం నుండి వినియోగదారుని నోటికి చేరేవరకు అనేక రకాలుగా ధరలు మారుతున్నాయి అయితే రైతుకు మాత్రం కేవలం 30 శాతం దక్కుతుంది, దళార్లకు 70 శాతం దక్కుతుంది. ఆరుగాలం కష్టించి పండించిన పంట అమ్ముకోవడానికి ఇటు ప్రభుత్వాలను, అటు దళారి వర్తక వ్యాపారులను బతిమిలాడ వలసిన పరిస్థితులు నేడు నెలకొన్నాయి. ఒక అడుగు ముందుకేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయాన్ని రాజకీయంగా వాడుకోవడానికి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకొని ఆందోళనలు ధర్నాలు చేపట్టిన సంఘటనలు ఇటీవల జరిగిన విషయాలే. దేశంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలంటే కేంద్ర ప్రభుత్వం వచ్చే బడ్జెట్ లో 2022- 23 వార్షిక విత్త ప్రణాళికల లో 18 లక్షల కోట్లు రూపాయలకు పెంచే అవకాశం ఉంది. 2021- 22 వార్షిక ఆర్థిక సంవత్సరంలో కేంద్ర బడ్జెట్ లో 16.5 లక్షల కోట్ల రుణ లక్షణాన్ని నిర్దేశించింది. ప్రభుత్వం ప్రతి సంవత్సరం వ్యవసాయ రంగానికి రుణాల లక్ష్యాన్ని పెంచుతుంది కాబట్టి అందుకు అనుగుణంగానే ఈ సారి కూడా పెంచడం ఖాయమని ఆర్థిక నిపుణులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. దేశంలో ఓ మే క్రాన్ వైరస్ ఉధృతమవుతున్న దుష్ట పంట రుణాల కులాలను పెంచే అవకాశం ఉందని చెప్పవచ్చు. వార్షిక వ్యవసాయ రంగాన్ని 2022 23 ఆర్థిక సంవత్సరంలో మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఉత్తరాది 5 రాష్ట్రాల్లో ఎన్నికల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే దిశగా ముందుకు పోతోంది.2017 18 ఆర్థిక సంవత్సరంలో 11. 68 లక్షల కోట్ల రూపాయల ఈ మేరకు రుణాలు ఇచ్చినారు. ఆ సంవత్సరం నిర్దేశించిన లక్ష్యం కంటే ఇది 10 లక్షల కోట్ల రూపాయలు అధికం. దీన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చే ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగానికి పెట్టుబడులు పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా రైతులు పూర్తిగా నష్టపోతున్నారు, తెలంగాణలో జనవరి 10-13 తేదీలలో కురిసిన అకాల వర్షాలు, వడగళ్ల వాన వల్ల లక్షల కోట్ల రూపాయలు పంటనష్టాన్ని రైతులు సవి చూశారు. చేతికి వచ్చే సమయానికి వడగండ్ల వానలు రైతులను నిండా ముంచాయి. వ్యవసాయ పెట్టుబడికి రైతుకు 65 శాతం తగ్గితే 35 శాతం వినియోగదారునికి దక్కుతుంది. కానీ 30 శాతం రైతుకు 70 శాతం దళారులకు దక్కడం వల్ల రైతుకు మిగిలేది మన్నె! కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే దిశగా దీర్ఘకాలిక ప్రణాళికలు చేపట్టాల్సిన అవసరం ఉన్నప్పటికీ. కేంద్ర ప్రభుత్వం ఇటీవల 50 శాతం ఎరువులపై ధరలు పెంచడం రైతుకు మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు గా ఉంటుంది. రైతు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేక  తేగన్ అమ్ముకుంటున్నాడు, వ్యవసాయదారుడు వంటలు వేసేటప్పుడు ఉన్న ధరలు కోసే సమయానికి లేకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్న ట్లు పలు సంస్థలు జరిపిన సర్వే ద్వారా వెల్లడవుతుంది. వాస్తవంగా గ్రౌండ్ రిపోర్ట్ పరిశీలిస్తే ప్రభుత్వాలకు అర్థమవుతుంది. పంట నష్టపోయిన సమయానికి రైతుల పరిస్థితులు, అతను స్థితిగతులు మానసిక వేదన, పడుతున్న తిప్పలు ఒక్కసారి ఒకసారి వ్యవసాయ అధికారులచే సర్వే చేపిస్తే వ్యవసాయదారుని వాస్తవ రూపం బట్ట బయలు అవుతుంది. కేవలం ఏసీ గదుల్లో కూర్చుని ప్రణాళికలు చేయడం అంత శ్రేయస్కరమైన పని కాదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు వాస్తవాలను తెలుసుకొని రైతుకు కావలసిన విధానాన్ని రూపొందించాలి. రైతులు సరాసరి ఉత్పత్తి వినియోగదారులకు అందించడం ద్వారా దళారుల ప్రమేయం లేకుండా ఇరువురికి లాభదాయకంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని దళార్లకు వెళ్లే దానిలో రైతుకు 65 శాతం తగ్గుతుంది కొంతవరకైనా రైతుకు గిట్టుబాటు అవుతుంది. భారతదేశం పూర్తిగా వ్యవసాయక దేశంగా గుర్తింపబడింది ప్రస్తుతం 63% ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇంతపెద్ద సంస్థను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రపంచంలోనే మొట్టమొదట వ్యవసాయం చేసింది సింధూ నాగరికతలోని కాబట్టి ప్రస్తుత శాస్త్రవేత్తల తో సమానంగా భారతీయ రైతులకు తెలివితేటలు ఉన్నాయి. తాను ఏ పంట పండిస్తే లాభ పడతాను అన్న పరిజ్ఞానం రైతు ఉంది. కానీ ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఒక లా అండ్ ఆర్డర్( శాంతిభద్రతల వ్యవహారంగా) భావిస్తూ రైతులపై పోలీసులను ఉసిగొల్పుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం పెరిగినప్పటికీ భారతదేశంలోని 83 శాతం రైతులు చిన్న ,సన్నకారు రైతులే కాబట్టి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం లేదని నివేదికలు  ధ్రువీకరిస్తున్నాయి. పంట చేతికందే సమయంలో రైతులు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకపోతేనే మెరుగైన ధర కోసం నిరీక్షిస్తున్నాడు కానీ 70 శాతం వ్యవసాయదారులు తెచ్చిన అప్పును వెంటనే తీర్చాల్సిన దుస్థితి ఉండడంవల్ల పంటను అయినకాడికి అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దశాబ్దాలుగా సాగు చేసే ప్రతి రైతుకు పంట రుణం అందించలేని ప్రభుత్వ వైఫల్యం వల్ల ఈ సమస్య తలెత్తుతుందని పలు సర్వేల ద్వారా తెలుస్తుంది. ఇప్పటికే రైతులు మద్దతు ధర దక్కడం లేదని వ్యవసాయ ఉత్పత్తులను రోడ్లపై పారబోయడం, లేదంటే చేనుకు నిప్పు పెట్టడం మనం చూస్తున్న విషయమే. ఇలాంటి పరిస్థితులు ప్రస్తుతం వ్యవసాయ రంగంలో నెలకొంటున్న, సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వాలకు తెలివి లేక కాదు, అమాయక రైతులు ప్రభుత్వాలు ను ఏమంటారు లే అన్న ధీమాతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరును బట్టి తెలుస్తుంది. కాబట్టి రైతు సంఘటితంగా ఉద్యమించడం మా! లేదంటే “క్రాఫ్ హాలిడే” ప్రకటిస్తే దేశం పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్న ప్రభుత్వ కార్యాలయాల ముందు ఉన్నది! రైతులు విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీని చేపట్టగల రైతు ఉత్పత్తి దారుల సంఘం గా ఏర్పడడమే దేశంలోని ఎన్నో ప్రాంతాల్లో నేడు అటువంటి సంఘాలు సేద్యంలో విప్లవం సృష్టించాయి. ఇటీవల 2020లో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త రైతులు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో సంవత్సరకాలం పాటు ఉద్యమించి సుమారు 750 మంది రైతులు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి చివరికి కేంద్ర ప్రభుత్వం తయారుచేసిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు చేపట్టిన ఉద్యమం మనకు తెలిసిందే. భారత దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న దేశంలోని రైతుల పరిస్థితులు ఏ మాత్రం మెరుగు పడకపోగా శోధించ వలసిన విషయమే! గ్రామాల వారీగా రైతుల సంఘాలు ఏర్పడితే రైతులు తాము పండించిన పంటకు తామే ధర నిర్ణయించుకునే స్థాయికి ఎదగాల్సిన పరిస్థితులు ఉన్నాయి. జాతీయ నైపుణ్య అభివృద్ధి పథకంలో భాగంగా రైతుల్ని వ్యవసాయ సాగు నిపుణులుగా తీర్చిదిద్దాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచనలు మంచిదే అయినప్పటికీ ఆచరణలో పెట్టడానికి ప్రణాళికలు తయారు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యవసాయ రంగంలో ఆహార పంటల తోపాటు ఉపాధి కల్పన వంటి పంటలను ముఖ్యంగా కోళ్ల పరిశ్రమ పందుల పెంపకం పాడి పరిశ్రమ, చేపల పెంపకం, గొర్రెల మేకల పెంపకం వంటి రంగాలను కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. మన దగ్గర ఉన్న కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు సూచనలు సలహాలు ఇవ్వడానికి శాస్త్రవేత్తలు ఉన్నప్పటికీ రైతులకు పూర్తి స్థాయిలో అందడం లేదన్న విషయాన్ని బల్లగుద్ది చెప్పవచ్చు! వ్యవసాయ రంగానికి బ్యాంకులు ఇస్తున్న రుణాలు సరిపోవడం లేదు ఎందుకంటే పెరిగిపోతున్న పెట్టుబడికి రైతు అప్పటికప్పుడు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల నుండి అప్పులు చేసి వ్యవసాయంపై పెట్టుబడి పెడుతున్నాడు, కాబట్టి బ్యాంకులు రైతుకు ఎకరాకు లక్ష ఇరవై వేల వరకు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంతో సన్న చిన్న కారు రైతులు ప్రయోజనం పొందుతారు. రానున్న బడ్జెట్లో ఈ కోణంలోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వార్షిక బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ఎక్కువ కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆర్థిక నిపుణులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులు అభిప్రాయపడుతున్నారు. వ్యవసాయంలో సేంద్రియ విధానం ప్రస్తుత పరిస్థితుల్లో యోగ్యమైనది కాదు ఎందుకంటే సేంద్రియ వ్యవసాయ పరిస్థితులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి దేశవ్యాప్తంగా రైతు పశు సంపదను కలిగి లేడు. కాబట్టి సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ విధానం ముందుకు సాగదు, ప్రస్తుత వ్యవసాయ పంటల పై విచ్చలవిడిగా పురుగుమందులు, రసాయనిక ఎరువులు, కాంప్లెక్స్ ఎరువులు వాడుకున్నారు వీటి స్థానంలో ఆధునిక వ్యవసాయ శాఖ పంటలు రూపొందించాల్సిన అవసరం ఉంది. శాస్త్రవేత్తలు ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టాలి! వ్యవసాయానికి వానికి రంగానికి ఉన్న వసతులు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో నెలకొల్పిన పరిశ్రమలు వాటి స్థానంలో వ్యవసాయ రంగాన్ని కూడా చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది సేద్యంలో సాంకేతిక వినియోగం తో దిగుబడులు పెంచాల్సిన అవసరం ప్రస్తుతం మన ముందున్న సవాళ్లు. వ్యవసాయ వాణిజ్య పరంగా అభివృద్ధి చేయాలంటే ఇందుకు సన్న చిన్నకారు రైతులను అభివృద్ధి పథంలోకి తీసుకు రావాల్సి న బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది లేదంటే ఇప్పటికే లక్షల ఎకరాలు స్థిరాస్తి గా మారిపోతున్నాయి రానున్న రోజుల్లో వ్యవసాయ యోగ్యమైన భూమి దక్కకుండా పోతుందన్న బాధ కలుగుతుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక సంయుక్త ప్రణాళికతో వ్యవసాయాన్ని బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం అంత శ్రేయస్కరంగా ఉండదు అన్న నానుడి ఆలోచన! రైతులకు ఆరుతడి మెట్ట లాభం చేకూర్చే యోగ్యమైన వ్యవసాయ విధానాలను, ఇందులో పండ్ల తోటల పెంపకం పరిశ్రమలతో అనుసంధానం తో కూడుకున్న వాణిజ్య పంటలను చేపట్టే విధంగా ప్రభుత్వాలు రైతును ప్రోత్సహించాలి, ఇందుకు కావలసిన దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
డాక్టర్. రక్కిరెడ్డి ఆదిరెడ్డి
కాకతీయ విశ్వవిద్యాలయము