Flood Relief - వరద బాధితులకు ఎయిర్‌టెల్‌ గుడ్‌న్యూస్‌..

Flood Relief - వరద బాధితులకు ఎయిర్‌టెల్‌ గుడ్‌న్యూస్‌..

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా పలు ప్రాంతాల ప్ర‌జ‌లు వరదల్లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రక్రియలో తమ కస్టమర్లకు సహాయం చేసేందుకు ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ ముందుకు వచ్చింది. ఈ విపత్క‌ర ప‌రిస్తుల్లో ఇరు రాష్ట్రాల్లోని వినియోగదారులకు కొన్ని మినహాయింపులు ప్రకటించింది. ఈ మేరకు ఎయిర్‌టెల్ సంస్థ (మంగళవారం) ఒక ప్రకటనను విడుదల చేసింది.

వినియోగదారులకు అదనపు వ్యాలిడిటీ ఇస్తామని స్పష్టం చేసింది. ప్రీపెయిడ్‌ కస్టమర్లకు అదనంగా 4 రోజుల వ్యాలిడిటీ ఇస్తున్నట్లు తెలిపింది. అన్‌లిమిటెడ్ కాల్స్‌తోపాటు 4 రోజులపాటు రోజుకు 1.5 జీబీ మొబైల్‌ డేటాను అందించనున్నట్లు పేర్కొంది. ఇక పోస్ట్‌పెయిడ్‌ వినియోగదారుల బిల్లు చెల్లింపునకు వారం రోజుల పాటు గడువు పొడిగించింది.ఇంటికి వైఫై కనెక్షన్ ఉన్న వాళ్లకు 4 రోజుల అదనపు వ్యాలిడిటీని కల్పించినట్టు ప్రకటించింది. ప్రస్తుత విపత్తు సమయంలో తమ కస్టమర్లకు అండగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్‌టెల్ వెల్లడించింది.