చేనేత కార్మికురాలిని సన్మానించిన ఆలేరు ఎమ్మెల్యే

చేనేత కార్మికురాలిని సన్మానించిన ఆలేరు ఎమ్మెల్యే

గుండాల, ముద్ర :- చేనేత దినోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ లో గుండాల చేనేత సహకార సంఘం సభ్యురాలు బిట్ల ఉమా రాణి  నీ ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సన్మానించి మాట్లాడుతూ సమాజంలో వ్యవసాయ రంగం తర్వాత చేనేత పరిశ్రమనే అతి పెద్ద పరిశ్రమని చేనేత రంగానికి అందిస్తున్న సేవలను గుర్తించి ఈ కార్మికు వారిని సన్మానించడం జరిగిందని అన్నారు.కార్మికులు చేనేత రంగానికి అందిస్తున్న సేవలను గుర్తించి ఇలాంటి పురస్కారాలు అందిస్తున్నామని అన్నారు .ఈ కార్యక్రమంలో  చేనేత సహకార సంఘం చైర్మన్ దూడక ఉప్పలయ్య తదితరులు ఉన్నారు