పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం...

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం...

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పట్టణం పురాణిపేట  శ్రీరాజరాజేశ్వర ఉన్నత పాఠశాల 1986-90 సంవత్సరాలలో విద్యాభ్యాసం చేసిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం హోటల్ వశిష్ఠ ఇన్ లో ఆదివారం జరిగింది. ఈ సందర్బంగా వారికీ విద్యను బోధించిన ఉపాద్యాయులను సన్మానించి, చిన్ననాటి పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. పాఠశాలలో చదివిన స్థానిక విద్యార్థులైన ఎన్నాకుల శ్రీకాంత్, చిత్రభాను రత్నాకర్, గుడికందుల మహేష్, చౌడారపు రాంకిషన్ గుప్త, టి.ఎల్.ఎన్.చారి తమవంతు సహాయ సహకారాన్ని అందించారు.