అమర్ రాజా కుటుంబం తెలంగాణ కు భారీ పరిశ్రమను తెచ్చింది

అమర్ రాజా కుటుంబం తెలంగాణ కు భారీ పరిశ్రమను తెచ్చింది

 అమర్ రాజా కుటుంబం తెలంగాణ కు భారీ పరిశ్రమను తెచ్చిందని మంత్రి కేటీఆర్​ అన్నారు. వారి కుటుంబ  సభ్యులందరికీ  ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. మహబూబ్​నగర్​ జిల్లాలోని దివిటిపల్లిలో అమర్ రాజా బ్యాటరీ పరిశ్రమ శంకుస్థాపన సంధర్భంగా మంత్రి కేటీఆర్​ మాట్లాడారు. పోటీ పరిశ్రమలో వొక పరిశ్రమ రాష్ట్రానికి రావాలంటే ఇతర దేశాలతో పోటీ పడాల్సివుంటుందని,  వారిని ఒప్పించి మెప్పించి తేవాల్సివుంటుందని అన్నారు.  మా దగ్గరికి రమ్మంటే మాదగ్గరికి రమ్మని రాష్ట్రాలు ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తారన్నారు.  మనకున్న అతిపెద్ద అస్సెట్ యువశక్తి..142 కోట్లల్లో 70 కోట్లమంది 27 ఏండ్ల లోపున్నారు. భారతదేశానికున్న అడ్వాంటేజ్ మరే దేశంలోనూ లేదన్నారు.  ఏ రాష్ట్రంలోనైనా సరే ప్రయివేట్ రంగంలో భాగస్వామ్యం కుదుర్చుకుని పరిశ్రమల స్థాపించడం  ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.  వొక్క పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా,  పరోక్షంగా ఉద్యోగాలు , అనుబంధ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అమర్ రాజా వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా 10 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు.

త్రిపుల్ ఎఫెక్ట్ ద్వారా చుట్టుపక్కల ఉపాధి అవకాశాలు రెట్టింపు అవుతాయన్నారు. పదేండ్లల్లో 9,500 కోట్ల పెట్టుబడి దశలవారీగా పెడతారని,  వారు  37 ఏండ్లలో  పెట్టిన దానికి రెట్టింపు పెట్టుబడిని ఇక్కడ పెడుతున్నారని కేటీఆర్​ అన్నారు. మేము  ఎంతో కష్టపడి  పరిశ్రమలు   తెస్తున్నాం . కానీ ప్రగతి నిరోధకులు ప్రతిచోటా వుంటారు.  నాడు దేవుండ్లకే తప్పలేదు మనం అంతకన్నా గొప్పవాళ్లం  కాదన్నారు. ఇక్కడ కాలుష్యం వస్తుందని చిల్లర మాటలు మాట్లాడే వాళ్లు  అర్థం చేసుకోవాల్సింది వుంది...అదేంటంటే  లిథియం అయాన్ బ్యాటరీ....లెడ్ ఆక్సైడ్ బ్యాటరీ వొకటి కాదని చెప్పారు.  భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు.  అవే ఇక్కడ తయారవుతాయి.

Also Read: ఏపీ పదో తరగతి  ఫలితాల్లో బాలికలదే పైచేయి

ఇక్కడ తయారయ్యే బ్యాటరీలన్నీ లిథియం బ్యాటరీలే  అని చెప్పారు.  జీరో లిక్విడ్ డిశ్చార్చ్ తో అంతర్జాతీయ ప్రమాణాలతో తయారు చేస్తారని అన్నారు.  చిత్తూరు తదితర ప్రాంతాల్లో వొక్క చుక్క కాలుష్యం లేదు.. ఇంకా అనుమానం వుంటే....10 బస్సులు పెట్టి అక్కడ పంపండి. అక్కడి చుట్టు పక్కల ప్రాంతాల్లో ఎంత గొప్పగా మారినాయో చూస్తారన్నారు.  జయదేవ్ ఇక్కడే ఇల్లు కట్టుకొని  వుంటారని  ఆశిస్తున్నా అని కేటీఆర్​ అన్నారు.  ఫ్యాక్టరీ నిర్మాణం సాగుతుండగానే...ఇక్కడ స్థానికులకు అర్హతకు తగ్గట్టు స్కిల్ డెవలప్ చేసి ఉద్యోగాలు కల్పిస్తాం.   వెనకబడ్డ పాలమూరు జిల్లాకు కుడిపక్కన కరివేన , ఎడమన ఉద్దండాపూరు మొత్తం 33 టిఎంసీల కెపాసిటీ అంటే 33 హుస్సేన్ సాగర్ల నీళ్ళు అందుబాటులోకి వస్తాయన్నారు.   అత్యాధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్...ఎయిర్ పోర్టు కూడా ఇక్కడనుంచి గంట దూరంలోనే వున్నదన్నారు.