ఏపీలో పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అమిత్ షా

ఏపీలో పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అమిత్ షా
  • ఏపీలో బీజేపీ పొత్తులపై త్వరలోనే నిర్ణయం ఉంటుందన్న అమిత్ షా
  • ఎన్డీయేలోకి కొత్త మిత్రులు వస్తున్నారని వెల్లడి
  • కూటమి నుంచి మిత్రులను తామెప్పుడూ బయటికి పంపించలేదని స్పష్టీకరణ
  • వాళ్ల రాష్ట్రాల్లో పరిస్థితుల దృష్ట్యా వారే బయటికి వెళ్లి ఉండొచ్చని వ్యాఖ్యలు

ఎన్నికల వేడి రాజుకుంటున్న సమయంలో, కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా పొత్తులపై స్పందించారు. ఏపీలో బీజేపీ పొత్తులపై త్వరలోనే నిర్ణయం ఉంటుందని తెలిపారు. ఎన్డీయేలోకి కొత్త మిత్రులు వస్తున్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే కూటమి నుంచి మిత్రులను తామెప్పుడూ బయటికి పంపలేదని స్పష్టం చేశారు.

వాళ్ల రాష్ట్రాల్లో పరిస్థితుల దృష్ట్యా వారే కూటమి నుంచి బయటికి వెళ్లి ఉండొచ్చని అమిత్ షా పేర్కొన్నారు. రాజకీయంగా ఎంత పెద్ద కూటమి ఉంటే అంత మంచిదని భావిస్తున్నామని అభిప్రాయపడ్డారు.