చంద్ర ఘంట అవతారంలో బాసర అమ్మవారు

చంద్ర ఘంట అవతారంలో బాసర అమ్మవారు

బాసర, ముద్ర:-దక్షిణ భారత దేశంలోనే ఏకైక విద్య ప్రదాయిని చదువుల తల్లి కొలువైన బాసర  బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో నవరాత్రి వేడుకలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మూడో రోజు అమ్మవారు చంద్ర ఘంట అలంకారంలో  భక్తులకు దర్శనమిచ్చారు. వేకువ జామున ఆలయ అర్చకులు, వేద పండితులు, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరి అన్నం, కొబ్బరి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామారావు పటేల్ అమ్మవారిని దర్శించుకునీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.