దారుణం... పదో తరగతి విద్యార్థిని గర్భవతిని చేసి అబార్షన్ చేయించిన కామాంధుడు...

దారుణం... పదో తరగతి విద్యార్థిని గర్భవతిని చేసి అబార్షన్ చేయించిన కామాంధుడు...

ముద్ర,తెలంగాణ:-రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో దారుణం చోటు చేసుకుంది. పదో తరగతి విద్యార్థిని గర్భవతిని చేసి ఒ కామాంధుడు అబార్షన్ చేయించాడు. వివరాల్లోకి వెళ్తే.. చేవెళ్లకు చెందిన సుదర్శన్‌ అనే వ్యక్తి మాయమాటలతో పదో తరగతి విద్యార్థిని లోబర్చుకొని గర్భవతిని చేశాడు. విషయం ఎవరికి తెలియకూడదని భావించి సదరు బాలికకు అబార్షన్ చేయించాడు.దీంతో విద్యార్తిని గాంధీ దవాఖానలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నది. బాలిక తండ్రి బుచ్చయ్య ఫిర్యాదు మేరకు సుదర్శన్‌పై ఫోక్సో యాక్ట్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, నిందితుడు సుదర్శన్‌కు ఇది వరకే పెళ్లయి.. ఓ పిల్లాడు కూడా ఉన్నాడు.ఈ సంఘటన పై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.