ఫోనులో డాక్టర్ సూచనలు.. ఆపరేషన్ చేసిన నర్సులు.. పసికందు మృతి

ఫోనులో డాక్టర్ సూచనలు.. ఆపరేషన్ చేసిన నర్సులు.. పసికందు మృతి

ముద్ర,తెలంగాణ:-వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యంతో పుట్టిన మగ శిశువు మృతి చెందింది. అందుబాటులో డాక్టర్ లేకపోవడంతో ఫోన్ ద్వారా నార్మల్ డెలివరీ చేశారు సిస్టర్లు. ఈ తరుణంలోనే… శిశువుకు శ్వాశ అడటం లేదంటూ 108లో ఏం జి యం కి తరలించింది వైద్య సిబ్బంది.

ఎంజీంఎంలో శిశువు చికిత్స పొందు నిన్న ఉదయం మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ నెల 16న వర్ధన్నపేట ఆసుపత్రి చేరింది గర్భిణీ శ్రీజ. మహబూబాబాద్ జిల్లా మర్రిపెడ మండలం గుండేపూడి గ్రామానికి చెందిన శ్రీజకు…ఈ నెల 17న నొప్పులు తీవ్రంగా కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఇక అదే రోజున మధ్యాహ్నం 3 గంటలకు ఆపరేషన్ థియేటర్లోకి ఆమెను తరలించారు నర్సులు. ఇక బంధువుల ఫిర్యాదు మేరకు వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ లో నమోదు అయింది. వైద్యులపై సెక్షన్ 304 కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నారు పోలీసులు. నిర్లక్ష్యం వహించిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.