వివాహేతర సంబంధమే భర్త హత్యకు దారి తీసింది

వివాహేతర సంబంధమే భర్త హత్యకు దారి తీసింది
  • వివరాలు వెల్లడించిన శంషాబాద్ డిసిపి నారాయణరెడ్డి
  • నిందితుల నుండి మూడు సెల్ ఫోన్లు ఒక కారు స్వాధీనం

ముద్ర/షాద్ నగర్:-  వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా వస్తున్నాడని నిపంతో భార్య, ప్రియుడు కలిసి హత్యకు కుట్ర చేసిన సంఘటన పోలీసులు చేదించారు. సోమవారం శంషాబాద్ డిసిపి నారాయణరెడ్డి తన కార్యాలయం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సందర్భంగా డిసిపి నారాయణరెడ్డి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎసిపి పరిధిలో కడతాల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని మక్త  మాదారం గ్రామ శివారులోని బట్టర్ ఫ్లై సిటీ వెంచర్ లో ఇంట్లో ఏప్రిల్ 29వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో విశాల్ మార్ట్ వద్ద సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న తాండ్ర రవీంద్ర (45) అన్న మృతుడిని భార్యతో పాటు తన ప్రియుడు యాదగిరి, అనిల్ కుమార్ కుమారులు బలవంతంగా కారులో కిడ్నాప్ చేసి కొట్టి దారుణంగా చంపినట్లు డిసిపి వివరించారు.

మృతుని ఆనవాళ్లు ఎక్కడ కనిపించకుండా ఉండాలని ఉద్దేశంతో నిందితులు వెంచర్లు మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు తెలిపారు. ఈ ఘటనపై నేనావత్ రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయని డీసీపీ తెలిపారు. రవీందర్ ను హత్య చేసిన యాదగిరి, అనిల్ కుమార్ తో పాటు భార్య గీతలను అరెస్టు చేయడంతో పాటు మూడు సెల్ ఫోన్లు, ఒక కారును స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్ కు తరలించినట్లు శంషాబాద్ డిసిపి నారాయణరెడ్డి తెలిపారు. ఈ మీడియా సమావేశంలో షాద్ నగర్ ఎసిపి రంగస్వామి తో పాటు ఇతర పోలీస్ సిబ్బంది ఉన్నారు. హత్య కేసును త్వరగా చేదించినందుకు పోలీస్ సిబ్బందిని డిసిపి నారాయణరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.