తుంగతుర్తి ప్రభుత్వాసుపత్రిలో ప్రసూతి సమయంలో పాప మృతి చెందిన సంఘటనపై మొదలైన విచారణ

తుంగతుర్తి ప్రభుత్వాసుపత్రిలో ప్రసూతి సమయంలో పాప మృతి చెందిన సంఘటనపై మొదలైన విచారణ
  • బాధితులను సిబ్బందిని విచారించిన విచారణ అధికారులు
  • తమ నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామని తెలిపిన అధికారులు

తుంగతుర్తి ముద్ర:తుంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం శ్రీలత అనే మహిళ ప్రసూతి కాగా పాప మృతి చెందిన సంఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. పాప మృతి చెందిన సంఘటనపై జిల్లా వైద్యశాఖ అధికారులు సోమవారం విచారణ చేపట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హుజూర్నగర్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ప్రవీణ్ కుమార్,  డాక్టర్ వనజ లు విచారనాధికారులుగా తుంగతుర్తి సిహెచ్సి కి వచ్చారు. విచారణ సమయంలో మృతి చెందిన పాప తండ్రితో పాటు బంధువులు తమ బాధను విచారణ అధికారులకు తెలిపారు .డాక్టర్ లేకుండానే ప్రసూతి ఎలా చేస్తారని తాము స్టాఫ్ నర్స్లను ప్రశ్నించామని వీడియో కాల్ ద్వారా ప్రసూతి  చేస్తామని స్టాఫ్ నర్స్ తెలిపారని బాధిత బంధువులు తెలిపారు .డాక్టర్ లేకుండా ప్రసూతి వద్దని తమ బిడ్డను సూర్యాపేటకు తీసుకుపోతామని చెప్పిన వినకుండా ప్రసూతి చేశారని చివరకు చనిపోయిన బిడ్డలను తమ చేతిలో పెట్టారని బాధితులు ఆరోపించారు. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కాలయాపన చేశారని డాక్టర్ లేకపోవడం వల్లనే బిడ్డ చనిపోయిందని  సంఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసు కోవాలని విచారణ అధికారులను వారు కోరారు.

  • విచారణ అధికారుల వివరణ:

తాము జరిగిన సంఘటనను విచారణ జరుపుతామని తమ విచారణలో తేలిన విషయాలు ఉన్నతాధికారులకు పంపుతామని తెలిపారు.