ప్రజావాణికి వినతుల వెల్లువ

ప్రజావాణికి వినతుల వెల్లువ

ముద్ర ప్రతినిధి, జనగామ: జనగామ జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి జనం పోటెత్తారు. కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య, అదనపు కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, రోహిత్ సింగ్ తమ సమస్యలపై వినతి పత్రాలను సమర్పించారు. లింగాలఘణపురం మండలం వనపర్తికి చెందిన ఎండి.సిగ్మతుల్లా షరీఫ్ సర్వే నంబర్ 43/1 లో ఉన్న తన తండ్రి భూమి తమపై పట్టా చేయుటకు దరఖాస్తు చేశారు. జనగామ పట్టణానికి చెందిన ఎం .రమేష్ తనకు 100 శాతం  వినికిడి సమస్య ఉన్నందున వికలాంగుల పెన్షన్ మంజూరు చేయాలని కోరారు. బచ్చన్నపేట మండలం బండనాగారానికి చెందిన సిహెచ్.జనార్దన్ రెడ్డి తన భూమి అన్యాక్రాంతం అయిందని తనకు న్యాయం చేయాల్సిందిగా దరఖాస్తు చేసుకున్నారు. స్టేషన్ ఘనపూర్ మండలం తానేదార్ పల్లికు చెందిన బత్తిని అశోక్ తమ గ్రామంలో వైకుంఠధామానికి వెళ్లే దారిలో చాలా ఇరుకుగా ఉండి ప్రజలకు ఇబ్బందికరంగా ఉందని ఆ సమస్యలు పరిష్కరించాలని కోరారు. 

జనగామ పట్టణంలో వక్ఫ్ బోర్డు ముస్లింల కబ్రస్థాన్ స్థలంను సర్వే నిర్వహించి హద్దులను  ఏర్పాటు చేయాలని మజీద్ హుస్సేన్ కోరారు.  మొత్తం 69 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. అనంతరం కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య అధికారులతో మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జనగామ,స్టేషన్ ఘనపూర్ ఆర్డీవోలు సిహెచ్.మధుమోహన్, కృష్ణవేణి, డీఆర్డీవో రాంరెడ్డి, జెడ్పీ సీఈవో వసంత, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ వేణుమాధవ్, సీపీఓ ఇస్మాయిల్, డీఏవో వినోద్ కుమార్, డీఈఓ రాము, డీఎస్ఓ రోజా రాణి, మున్సిపల్ కమిషనర్ రజిత, డీఎంహెచ్‌వో డాక్టర్ ప్రశాంత్, ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్‌ డాక్టర్ సుగుణాకర్ రాజు, కలెక్టరేట్ పరిపాలన అధికారి ఏకే మన్సూర్ పాల్గొన్నారు.