షాద్ నగర్ బీజేపి ఎమ్మెల్యే అభ్యర్థి గా అందే బాబయ్య

షాద్ నగర్ బీజేపి ఎమ్మెల్యే అభ్యర్థి గా అందే బాబయ్య

ముద్ర, షాద్‌నగర్:-షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి గా అంధే బాబయ్య ను బీజేపీ ప్ర‌క‌టించింది. భారతీయ జనతా పార్టీ షాద్ నగర్ అసెంబ్లీ అభ్యర్థిగా సీనియర్ నాయకుడు ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందే బాబయ్యకు అవకాశం కల్పించారు. అధిష్టానం విడుదల చేసిన మూడవ జాబితాలో అందె బాబయ్యకు షాద్ నగర్ స్థానం నుండి అవకాశం లభించింది.అటు రాజకీయంగా ఇటు సామజిక పరంగా ఎన్నో సేవలందించారు.అధికార  బి ఆర్ ఎస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ తన దైన శైలిలో ప్రజల అభిమానాలు పొందారు. అనదికాలంలోనే విస్తృత సేవలను గుర్తించి బిజేపీ రాష్ట్ర అధిష్టానం  షాద్ నగర్ బీజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులునిగా అందే బాబయ్యాను నియమించారు.బుధవారం మూడో విడత బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థుల   ఎంపికను విడుదల చేయగా షాద్నగర్ పట్టణానికి చెందిన అందే బాబాయ్యకు ఎమ్మెల్యే టికెట్ దక్కటం తో కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున సంబురాలు చేసుకున్నారు.