సెలవుపై విదేశాలకు  ఏపీ సీఐడీ చీఫ్.. ప్రభుత్వం మారడం వల్లేనా?

సెలవుపై విదేశాలకు  ఏపీ సీఐడీ చీఫ్.. ప్రభుత్వం మారడం వల్లేనా?

ముద్ర,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ సీఐడీ చీఫ్ సంజయ్ విదేశీ  పర్యటనకు వెళుతున్నారు. సెలవుపెట్టి అమెరికాకు వెళ్లబోతున్నారు. ఆయన బుధవారం నుంచి వచ్చే నెల 3 వరకు సెలవు పెట్టారు. తాను వ్యక్తిగత కారణాలతో అమెరికా పర్యటనకు వెళుతున్నానని.. సెలువులు కోరుతూ సీఎస్‌ జవహర్ రెడ్డికి దరఖాస్తు చేసుకున్నారు. సీఎస్ జవహర్ సంజయ్‌కు సెలవులు మంజూరు చేశారు.. అమెరికా వెళ్లేందుకు వెంటనే అనుమతిని ఇచ్చారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు.

సంజయ్ సెలవుపై అమెరికాకు వెళ్లడం చర్చనీయాంశమవుతోంది. సీఐడీ చీఫ్‌గా సంజయ్ ఉన్న సమయంలోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. అలాగే చంద్రబాబు అరెస్ట్‌పై సంజయ్, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి పలు ప్రెస్‌మీట్‌లు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే సంజయ్ అమెరికా వెళ్లేందుకు సెలవుల కోసం దరఖాస్తు చేసుకోగా.. సీఎస్ జవహర్ రెడ్డి అనుమతి ఇచ్చారు. దీంతో సంజయ్ ఎపిసోడ్ చర్చనీయాంశమైంది. కొత్త ప్రభుత్వం కొలువు తీరనున్న తరుణంలో ఆయన సెలవు పెట్టి విదేశాలకు వెళ్లడం ఆసక్తికరంగా మారింది.