కోదాడ రూరల్  ఎస్సై గా బాధ్యతలు స్వీకరించిన అనీల్ రెడ్డి

కోదాడ రూరల్  ఎస్సై గా బాధ్యతలు స్వీకరించిన అనీల్ రెడ్డి

ముద్ర ప్రతినిధి , కోదాడ:- కోదాడ రూరల్ ఎస్సై గా ఎం అనీల్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు . అనంతగిరి నుండి బదిలీపై కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఈయన సోమవారం బాధ్యతలు స్వీకరించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు . రాష్ట్ర సరిహద్దుగా ఉన్న కోదాడ మండలంలో అక్రమ వ్యాపారాలు చేసేవారి పట్ల కఠినంగా ఉంటానని అన్నారు . ముఖ్యంగా గంజాయి రవాణా , పీడీఎస్ బియ్యం రవాణా పై ప్రత్యేక నిఘా పెడతానని అన్నారు . అందరి సహకారంతో మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తా అన్నారు . ఈ సందర్భంగా స్టేషన్ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు .