అంకిరెడ్డి ఆశయాలు సాధించాలి

అంకిరెడ్డి ఆశయాలు సాధించాలి

చిట్యాల అమర్నాథరెడ్డి

హుజూర్నగర్ ,:ముద్ర హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తండ్రి అయిన శానంపూడి అంకిరెడ్డి సేవలు మనవలేనివని  బిఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షులు చిట్యాల అమర్నాథ్ రెడ్డి ,పట్టణ ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ అమర్ గౌడ్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో కలిసి అంకిరెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా  పట్టణ పార్టీ అధ్యక్షులు చిట్యాల అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ కరోనా సమయంలో హుజూర్నగర్ ప్రాంతవాసులను అంకిరెడ్డి గోపిరెడ్డి సేవాసమితి స్థాపించి కరోనా బారిన పడ్డ అనేక మందికి మెరుగైన చికిత్స కోసం సూర్యాపేట ,ఖమ్మం, హైదరాబాద్ ,వంటి సుదూర ప్రాంతాలకు సొంత ఖర్చులతో అంబులెన్స్ సౌకర్యం ఏర్పాటు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఎరగని గురవయ్య ,ఇట్టి మల్ల మధు, తండు సాయిరాం ,శంకర్ రెడ్డి, నరసింహ ,వెంకటేశ్వర్లు, బోనాల లక్ష్మారెడ్డి, విజయ్ కుమార్, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు