పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో మరో ఘటన చోటు చేసుకుంది

పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో మరో ఘటన చోటు చేసుకుంది
  • పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో అసలు ఏం జరుగుతూంది..
  • పదిహేను రోజుల క్రీతం జరిగిన ఘటన మరవకముందే మరో ఘటన..

ముద్ర, కోరుట్ల: జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న అనిరుధ్ మృతి చెందాడు. పదిహేను రోజుల క్రీతం జరిగిన ఘటన మరవకముందే మరో ఘటన చోటుచేసుకుంది. మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో అసలు ఏం జరుగుతుందన్న విషయం అర్థం కావడం లేదు. పదిహేను రోజుల క్రితమే ఘటన జరిగి ముగ్గురు విద్యార్థులు ప్రమాదానికి గురయ్యారు.  శుక్రవారం తెల్లవారుజామున ఆరవ తరగతి చెందిన ముగ్గురు విద్యార్థులకు అస్వస్థకు గురవడం ఆందోళన కలిగించింది. తెల్లవారు జామున మూడు గంటలకు ఓ విద్యార్థి జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే లోపే చనిపోవడం జిల్లా వ్యాప్తంగా సంచలనం రేగింది. మరో ఇద్దరి విద్యార్థులలో ఒకరిని నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించగా మరో విద్యార్థికి స్థానిక మెట్పల్లి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

మృతి చెందిన విద్యార్థి సిరిసిల్ల మండలం ఎల్లారెడ్డిపేట గ్రామం చెందిన అనిరుధ్. ఇంకొకరు మల్యాల మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన హేమంత్ యాదవ్ను మెట్పల్లి హాస్పిటల్ చికిత్స అందిస్తున్నారు. మరొక విద్యార్థి మెట్పల్లి మండలం ఆత్మకూరు చెందిన మోక్షిత్ నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం చికిత్స అందిస్తున్నారు.