హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు మరో కీలక పదవి..!

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు మరో కీలక పదవి..!

రేవంత్ సర్కార్ హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌కు మరో కీలకమైన బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న చెరువుల పరిరక్షణకు ఏర్పాటు చేసిన లేక్స్‌ ప్రొటెక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా ఆయనను నియమించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ కమిటీ ఛైర్మన్‌గా హెచ్‌ఎండీఏ కమిషనర్‌ కొనసాగుతున్నారు. ఏడు జిల్లాల పరిధిలో చెరువుల పరిరక్షణను కూడా హైడ్రా కిందకు తేవడంతో ఆక్రమణలకు గురికాకుండా కాపాడవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

రేవంత్ సర్కార్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత చెరువులు పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డు వరకున్న చెరువులు, కుంటలు, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లు ఆక్రమించి చేపట్టించిన నిర్మాణాలను హైడ్రా కూల్చి వేస్తోంది. అయితే హెచ్ఎండీఏ పరిధిలో దాదాపు ఏడు జిల్లాలున్నాయి. వీటి పరిధిలోని చెరువుల పరిరక్షణను హైడ్రా కిందకు దాదాపు తీసుకొచ్చింది. దీనివల్ల చెరువులు ఆక్రమణలకు గురికాకుండా కాపాడవచ్చని ప్రభుత్వ అంచనా.