ఓటర్ నమోదుకు దరఖాస్తు చేసుకోవాలి

ఓటర్ నమోదుకు దరఖాస్తు చేసుకోవాలి

ముద్ర/వీపనగండ్ల :- ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమంలో భాగంగా 2025 జనవరి ఒకటో తేదీ నాటికి 18 సంవత్సరాల నిండే యువతి యువకులు ఓటర్ నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో శ్రీనివాసరావు కోరారు.10వ తేదీ లోపు గ్రామాలలో పోలింగ్ కేంద్రాల వద్ద బిఎల్ఓ లు( అంగన్వాడీ టీచర్లు) ఓటర్ నమోదుకు దరఖాస్తు తీసుకుంటున్నారని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

అంతేకాక ఓటర్ జాబితాలో మార్పులు చేర్పులు సరి చేయుట, మరణించిన వ్యక్తుల వివరాలు తొలగించడంతోపాటు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి నివాసాన్ని మారిన ప్రతి ఓటరు జాబితాలో మార్పునకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిందని తెలిపారు. కార్యక్రమంలో బిఎల్వోలు సుగుణ బాయ్, మహేశ్వరి, సువర్ణ,ఎల్లమ్మ, ఉన్నారు