ఎన్నికల కోసం ఆర్వోల నియామకం - కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ

ఎన్నికల కోసం ఆర్వోల నియామకం - కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండడంతో కేంద్ర ఎన్నికల సంఘం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారులను నియమించింది. ఈ మేరకు గురువారం కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రిటర్నింగ్ అధికారులతోపాటు సహాయ రిటర్నింగ్ అధికారులకు సంబంధించిన పోస్ట్ లను ఖరారు చేసింది. నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా అదనపు కలెక్టర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్లు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు, మున్సిపల్ కమిషనర్లను నియమించింది. అలాగే అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా ఆయా నియోజకవర్గం పరిధిలోని తహసీల్దార్లను , మున్సిపల్ కమిషనర్లను, అసిస్టెంట్ మున్సినపల్ కమిషనర్లను నియమించింది.