నిందితుల అరెస్టు

నిందితుల అరెస్టు

ముద్ర,పెబ్బేరు (ఏప్రిల్ 15 ): వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల ఉగాది పండుగ రోజు అర్ధరాత్రి 9 షాపుల్లో దొంగతనాలకు పాల్పడిన నిందితులను పెబ్బేరు పోలీసులు పట్టుకున్నారు.  ఈ సందర్భంగా  కొత్తకోట సీఐ రాంబాబు ఎస్సై హరిప్రసాద్​ రెడ్డితో కలిసి ప్రెస్​ మీట్​ నిర్వహించి వివరాలను వెల్లడించారు. కర్నూల్​ జిల్లా కేంద్రం అరోరా నగర్​ కు చెందిన శివ తన స్నేహితులైన మరో ముగ్గురు మైనర్లతో కలిసి ఈ చోరీలకు పాల్పడినా. ఉగాది పండుగైన మంగళవారం  రాత్రి 11.30 గంటల నుంచి పెబ్బేరు టౌన్​లో 2 స్కూటీలపై  రెక్కీ చేసి ఆ రోజు అర్ధరాత్రి 12.30 నుంచి 2.30 గంటల వరకు 4 షాపుల్లో మొబైల్​ ఫోన్లు, రెండు ట్యాబ్​లను చోరీ చేశారు.  మిగతా షాపుల తాళాలు తెరిచి చోరీ చేసేందుకు ప్రయత్నించారు. 

ఈ క్రమంలో ఈ కేసు దర్యాప్తు చేస్తుండగా ఈ నెల 15 న సోమవారం తెల్లవారుజామున పోలీసులు పెబ్బేరు బైపాస్​ వద్ద వాహనాలు చెక్​ చేస్తుండగా వారిపై అనుమానమొచ్చి వారిని చెక్​ చేయగా వారి వద్ద గద్వాల్​, పెబ్బేరులో చోరీ చేసిన రెండు ఐ ఫోన్లు, పోకో, రియల్​ మి, ఒప్పో ఫోన్లు, రెండు ట్యాబ్​లు, వాటి విలువ  రూ.3.50 లక్షల దాకా ఉంటుంది. రూ.3,500 నగదును స్వాధీనం చేసుకున్నారు.  అనంతరం  వారిని స్టేషన్​ తరలించి విచారణ చేయగా నిజాలు ఒప్పుకున్నారు. వారి వద్ద నుంచి రెండు స్కూటీలను కూడా స్వాధీనం చేసుకున్నారు. 3 మైనర్లను మహబూబ్​నగర్​లోని జువైనల్​ కోర్టులో హాజరు పరిచి, శివపైకేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. కేసు త్వరితగతిన ఛేదించినందుకు ఎస్సైని, పోలీసు బృందాన్ని ఆయన అభినందించారు.