53వ జాతీయ భద్రతా వారోత్సవాల్లో భాగంగా  డెక్కన్ సిమెంట్స్ లో భారీ ర్యాలీ...

53వ జాతీయ భద్రతా వారోత్సవాల్లో భాగంగా  డెక్కన్ సిమెంట్స్ లో భారీ ర్యాలీ...

ముద్ర,పాలకీడు:-మండలంలోని భవానీపురం సున్నపురాయి గని" డెక్కన్ సిమెంట్స్ లిమిటెడ్ కర్మాగారం లో "53వ జాతీయ భద్రతా వారోత్సవాల సదర్భంగా  సోమవారం కార్మికులంతా బారీ ర్యాలీ తీశారు. ఆ సంస్థ  వైస్ ప్రెసిడెంట్ (వర్క్స్)  సిఫ్టీ కమిటి ప్రెసిడెంట్ ఎన్.శ్రీనివాస రాజు,  చీఫ్ జనరల్ మేనజర్ ఎస్. నాగ మల్లేశ్వర రావ్, స్క్రిప్ట్ కమిటి జనరల్ సెక్రటరి శ్రీ పి. యస్. రావులు  సంయుక్తంగా జెండా ఎగురవేసి, కంపెనీ కార్మికులు, స్టాప్, సెక్యూరిటీ సిబ్బందితో కలిసి  జాతీయ గీతాలాపన , భద్రతా శపధం చేసి వారోత్సవాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా సంస్థ ముఖ్యులు మాట్లాడుతూ  2024 సంవత్సరపు జాతీయ భద్రతా నినాదం అయిన " ఉత్తమమయిన పర్యావరణం, సాంఘిక మరియు పాలన కొరకు భద్రతా నాయకత్వం పై దృష్టి పెట్టడం గురించి వివరిస్తూ " కర్మాగార పని ప్రదేశాలలో, రహదారులపై, అందరు క్రమశిక్షణతో భద్రతా నియమాలను పాటిస్తూ తమను , ఎదుటివారిని సురక్షితంగా ఉంచేలా జాగ్రత్తలు పాటిస్తూ తమ కుటుంబాలకు, సమాజానికి భద్రతతో కూడిన వాతావరణాన్ని ఏర్పరిచేలా తమ జీవనవిధానాలు ఉండాలని తెలియచేసారు.