కలెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన  ఆశిష్ సంగ్వాన్

కలెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన  ఆశిష్ సంగ్వాన్

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి:కామారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఆశిష్ సంగ్వాన్ ఆదివారం నాడు పదవి భాద్యతలు చేపట్టారు. అదనపు కలెక్టర్లు చంద్ర మోహన్, శ్రీనివాస్ రెడ్డి లు పూల మొక్కలు ఇచ్చి కలెక్టర్ కు ఘనస్వాగతం పలికారు. శనివారం నాడు రాష్ట్ర ప్రభుత్వం 20మంది జిల్లా  కలెక్టర్లను బదిలీ చేసిన విషయం విదితమే. గత అక్టోబర్ నుండి నిర్మల్ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న సంగ్వాన్  కామారెడ్డి జిల్లాకు బదిలీకాగా ఆదివారం నాడు జిల్లా  కలెక్టర్ గా చార్జి తీసుకున్నారు.  అనంతరం జిల్లాలో అమలు జరుగుచున్న కార్యక్రమాలను  ధరణి, ధాన్యం సేకరణ,  డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రగతిని  అదనపు కలెక్టర్లను  అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుండే వచ్చే ప్రజావాణి ఫిర్యాదులపట్ల ప్రత్యేక శ్రద్ధతో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలన్నారు.  

ఆర్డీఓ రంగనాథ రావు, గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ, ఎస్సి అభివృద్ధి అధికారి రంజిత, డీఈఓ రాజు, డిపిఆర్ ఓ శాంతికుమార్, తహశీల్ధార్ జనార్దన్,  కలెక్టరేట్ ఎఓ  మసూర్ అహ్మద్, కలెక్టరేట్ పర్యవేక్షకులు, సిబ్బంది తదితరులు కలెక్టర్ కు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.