Sindhu Hospital - విశ్వనగరం హైద్రాబాద్ లో ఆసియా లోనే పెద్దదైన "సింధు హాస్పిటల్స్"
- రాష్ట్రపతి లేదా ప్రధాని చేతుల మీదగా త్వరలో ప్రారంభం ...
- హెటిరో ఆధ్వరంలో ఆసియాలోనే అతి పెద్దదైన సింధు హాస్పిటల్ సేవలు ప్రారంభం
- పేద ధనిక తేడా లేకుండా వైద్యం అందించడమే లక్ష్యం
- వేయిమంది డాక్టర్లతో ఇప్పటికే సేవలు ప్రారంభం
విశ్వనగరం హైద్రాబాద్ లో మరో విశ్వరూపంగా నిలవబోతున్న "సింధు హాస్పిటల్స్" సేవలు ఇప్పటికే ప్రారంభమైయ్యాయి.... 14 వందల బెడ్స్ తో అత్యంత సాంకేతిక పరికరాలతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ హాస్పిటల్ ను ప్రధాని లేదా రాష్ట్రప్రతి చేతుల మీదగా ప్రారంభించాలని సంకల్పించినట్లు "సింధు హాస్పిటల్" , హెటిరో సంస్థల చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్,రాజ్యసభ సభ్యులు బండి పార్థసారధిరెడ్డి తెలిపారు .. తన కూతురు సింధు జ్ణాపకార్థం దీని ప్రారంభించామని పేర్కొన్నారు.
వరద భాదితుల సహాయార్ధం ఖమ్మం జిల్లా కలెక్టర్ కు కోటి రూపాయల చెక్కును అందించేందుకు ప్రత్యేకంగా హైద్రాబాద్ నుంచి వచ్చిన పార్థసారధిరెడ్డి కలెక్టరేట్ లో మీడియా తో మాట్లాడుతూ ఆసియాలోనే అతిపెద్దదైన సింధు హాస్పిటల్ సేవలు హైద్రాబాద్ హైటెక్స్ కు సమీపంలోని విశాలమైన ప్రాంగణంలో నిర్మించినట్లు చెప్పారు ... ఇందులో పనిచేసేందుకు 1000 మంది డాక్టర్లను మరో 1000 మంది సిబ్బందిని ఇప్పటికే నియమించామన్నారు.
వైద్యం అందించడంలో పేద, ధనికుడు అనే తేడా లేకుండా అందరికి ఒకేరకమైన వైద్యం అందజేయాలని లక్ష్యంతో ఉన్నామన్నారు ... అన్నిటిలో కచ్చితమైన తేడా ఉండాలనే తాము భావిస్తున్నామన్నారు ...రోగులకే కాకుండా వారి వెంట వచ్చే సహాయకులకు సైతం ఉచిత భోజనాలు అందించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ...రోజుకు వేయి మందికి భోజనాలు అవసరమని భావిస్తున్నామని అందుకు అనుగుణంగా మంచి భోజనాలు పెడతామని వారికీ ఉండేందుకు షేడ్లు కూడా ఏర్పాటు చేస్తున్నానని తెలిపారు ..
అత్యాధునిక సౌకర్యాలతో నిర్మితమైన ఈ బహుళ ప్రయోజ హాస్పిటల్ లో ప్రత్యేకించి క్యాన్సర్ చికిత్స కోసం ప్రత్యేక విభాగం ఉంటుందని చెప్పారు ... మిగతా అన్ని డిపార్ట్మెంట్లు పనిచేస్తాయని స్పెషలిస్టులు ఉంటారని, లేటెస్ట్ టెక్నాలజీ తో అన్ని రకాల పరీక్షలకు ల్యాబ్ లు ఉంటాయని అన్నారు .. అత్యంత ఆధునికి చికిత్సఅందించడం తమ లక్ష్యమన్నారు ... 14 వందల బెడ్స్ కలిగిన హాస్పిటల్ దేశంలోనే లేదన్నారు ... ఆసియా లోనే అతిపెద్దదిగా ఉండబోతుందని పేర్కొన్నారు ..ఇంతటి పెద్ద ఆసుపత్రిని హైద్రాబాద్ లో నిర్మించడం గర్వకారణమన్నారు ..అతి త్వరలో దీన్ని లాంఛనంగా ప్రారంభిస్తామని తెలిపారు ...అత్యాధునిక వైద్యం ప్రజలకు ప్రధానంగా పేదలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే దీన్ని ప్రారంబిస్తున్నామన్నారు. మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పాల్గొన్నారు.