అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్ఎస్ లో చేరికలు

అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్ఎస్ లో చేరికలు
  • ఎమ్మెల్యే, బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నల్గొండ:-జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆకర్షితులై బీఆర్ఎస్ లో చేరుతున్నారని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఆ గ్రామాల్లోని బూత్ స్థాయి కమిటీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. అంతకుముందు చండూరు, సంస్థాన్ నారాయణపురం మండలాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నుండి దాదాపుగా 35 కుటుంబాలు బీఆర్ఎస్ లో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జరుగుతున్న అభివృద్ధి చేసే విఆర్ఎస్ లో చేరుతున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసే బిజెపి, కాంగ్రెస్ పార్టీల నుండి బీఆర్ఎస్ లో చేరుతున్నారు అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కర్నాటి వెంకటేశం, ఎంపీటీసీలు గొరిగి సత్తయ్య, ఆయా మండలాల బీఆర్ఎస్ అధ్యక్షులు, సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.