ఇద్దరు సూడో నక్సల్స్ అరెస్టు

ఇద్దరు సూడో నక్సల్స్ అరెస్టు
  • నిందితుల నుంచి రెండు ఎయిర్స్ గన్స్ స్వాధీనం
  • ఇద్దరు జిల్లా వాసులే నన్న : రామగుండం సీపీ

మంచిర్యాల జిల్లా నస్పూర్ లో ఓ వ్యక్తిని ఎయిర్ గన్స్ తో బెదిరించిన డబ్బులు వసూలు చేయాలని ప్రయత్నించిన ఇద్దరు సూడో నక్సల్స్ చెరసాల పాలయ్యారు. ఈ మేరకు రామగుండం సిపి రెమా రాజేశ్వరి గురువారం మంచిర్యాలలోని డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. లక్షెట్టిపేట మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన మేడి వెంకటేష్ ,పెద్దంపేటకు చెందిన ఆరెందుల రాజేష్ ఇద్దరు మిత్రులు కాగా సులువుగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో నక్సల్ అవతారం ఎత్తారని తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం మందగించడంతో డబ్బుల అవసరం పెరిగాక నక్సల్స్ గా మారాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. హైదరాబాద్ లో రెండు ఎయిర్ గన్స్ కొనుగోలు చేసి గుర్తుతెలియని వ్యక్తి వద్ద సెల్ఫోన్ , సిం కార్డు కొనుగోలు చేశారన్నారు. నస్పూర్ కు చెందిన కాంతయ్య అనే వ్యక్తిని ఎంపిక చేసి ఫిబ్రవరి 21వ తేదీన ఆయన ఇంటి ముందు రాత్రి ఎయిర్ గన్స్ పడేశారని తెలిపారు. ఉదయం కాంతయ్య కుమారుడు బాలరాజుకు ఫోన్ చేసి తిర్యాని దళానికి చెందిన నక్సల్స్ మనీ 40 లక్షలు పార్టీ ఫండ్ ఇవ్వకపోతే కుటుంబ సభ్యులను చంపుతామని బెదిరించారని ఆమె వివరించారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలించి అరెస్టు చేయడం జరిగిందని జరిగిందని ఆమె చెప్పారు. రాజేష్ పై గతంలో మంచిర్యాల ,హజీపూర్ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదయయ్యాయని సీపీ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో కృషిచేసిన మంచిర్యాల రూరల్ సీఐ సంజీవ్, సిబ్బందికి నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. ఈ సమావేశంలో మంచిర్యాల డీసీపీ సుధీర్, ఏ ఎస్ పి తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.