సారంగాపూర్ లో ఆటో డ్రైవర్లు ధర్నా

సారంగాపూర్ లో ఆటో డ్రైవర్లు ధర్నా

ముద్ర ప్రతినిధి, నిర్మల్:నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలో ఆటో డ్రైవర్లు బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బస్సులకు అడ్డంగా తమ ఆటోలు ఉంచి నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసి బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పించటం వల్ల తమకు ఉపాధి పోయిందని ఆటో డ్రైవర్లు ఆందోళన వెలిబుచ్చారు. ఈ నిర్ణం వల్ల అప్పులు చేసి ఆటోలు కొనుక్కుని జీవనం సాగిస్తున్న తమకు అప్పుల భారం పెరిగి జీవనం దుర్భరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో ఉపాధి కోల్పోయిన తమను ఆదుకోవాలని కోరారు.