సిపిఆర్ పై అవగాహన పెంచుకోవాలి

సిపిఆర్ పై అవగాహన పెంచుకోవాలి
  • కళాశాల విద్యార్థుల కొరకు కంటివెలుగు పరీక్షలు
  • యోగా, ప్రాణాయామాన్ని  కళాశాలలో ఒక క్లాసు నిర్వహించాలి
  • షుగర్, బిపి పరీక్షలు కూడా చేయించండి
  •  రాష్ట్ర ఆర్థిక, వైద్యఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరిష్ రావు


ముద్ర ప్రతినిధి కరీంనగర్ : మారుతున్న మనిషి జీవనవిధానంతో అతిచిన్న వయస్సులో గుండే సంబంధిత వ్యాదుల బారిన పడుతు వారిని కాపాడే తక్షణ తరుణోపాయం సిపిఆర్ విదానం గురించి అందరు అవగాహనను కలిగి ఉండాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరిష్ రావు పిలుపునిచ్చారు.

బుదవారం జిల్లా కేంద్రంలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో రాష్ట్ర బీసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి సౌజన్యంతో నిర్వహిస్తున్న కార్డియాక్ హెల్త్ స్క్రీనింగ్, మీ గుండే పదిలం కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక, వైద్యఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరిష్ రావు విశిష్ట అతిధిగా పాల్గోన్నారు.   ఈ సందర్బంగా మంత్రి  మాట్లాడుతూ, రాష్ట్రంలో కరోనా తరువాత ఆరోగ్య పరీస్థితులలో మార్పులు చోటుచేసుకొని కార్డియాక్ అరెస్ట్, హర్ట్ అటాక్ వంటి హృద్రోగ సమస్యలు అదికంగా వస్తున్నాయని అన్నారు.  మనతోనే ఉండి గుండే సంబంధిత సమస్యతో కుప్పకూలే వారిని తక్షణం రక్షించడంలొ బాగంగా వారిని ఆసుపత్రికి తరలించడానికి అంబులెన్స్ ఫోన్ చేయడం మాత్రమే కాదు సిపిఆర్ విధానం ద్వారా చాతి పైబాగంలో నొక్కడం, నోటిద్వారా స్వాసను అందించడం గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు.  ఒక్కప్పుడు వయస్సుపైబడిన వారికి మాత్రమే వచ్చే హృద్రోగ సమస్యలు ఇప్పుడు 18 సంవత్సరాల పిల్లలు కూడా చనిపోతున్నారని అన్నారు.  అలాంటి పరీస్థితులను జిల్లాలోని విద్యార్థులు  ఎదుర్కోకుండా, కళాశాల స్థాయి 18 సంవత్సరాల మొదలుకొని 40 సంవత్సరాల వరకు గల విద్యార్థులకు ఐఎంఏ సహాకారంతో ఉచితంగా గుండే స్క్రీనింగ్, ఈసిజి మరియు 2డి ఎకో వంటి గుండే పరీక్షలు నిర్వహించడంతో పాటు సమస్యలు ఉన్నవారికి ఉచితంగా మందులను కూడా ఇవ్వతలపెట్టిన రాష్ట్ర బీసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కు ఈ సందర్బంగా అభినందనలు తెలియజేశారు.  ఈ తరహ కార్యక్రమం దేశంలోనే ప్రప్రథమమని కొనియాడారు.  కళాశాలు యోగా, ప్రాణాయామం ప్రతిరోజు క్లాసులలో బాగంగా నిర్వహించాలని,  తద్వారా పిల్లలు మానసిక ఒత్తిడిని, సమస్యలను సమర్దవంతంగా ఎదుర్కోకొనే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మెడికల్ కళాశాలలొ తరగతులను నిర్వహిస్తున్నామని తెలిపారు.  వాకింగ్ వలన కూడా ఆరోగ్య పరీస్థితులను మెరుగు పరుచుకోవచ్చని పేర్కోన్నారు.  కళాశాల విద్యార్థుల కొరకు ప్రత్యేక కంటివెలుగు శిబిరాలను ఏర్పాటు చేసి కంటి పరీక్షలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.  

రాష్ట్ర బీసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ,  కోన్ని రకాల సూచనలను అందిస్తు హర్ట్ అటాక్ వస్తే, ఎటువంటి సూచనలు ఇవ్వకుండా కోన్ని సెకన్లలోనే మనిషిని కుప్పకులేలా చేసిది కార్డియాక్ అరెస్ట్ అని అన్నారు.  ఈ కార్డియాక్ అరెస్ట్ కారణంగా కోన్ని నెలల క్రితం వాకింగ్ కు వెల్లిన వారి సోదరుడు చనిపోయిన విషయాన్ని గుర్తుచేశారు.  తన వద్ద ఖరీదైన వైద్యం చేయించుకునే స్థాయిలో ఉన్నప్పటికి ఎమిచేయలేని పరీస్థితి ఎదురైదని తెలిపారు.   ఈ మద్య కాలంలో చిన్నవయస్సు వారు కూడా గుండే సమస్యలతో చనిపోతున్నారని, అలాంటి పరీస్థితులు మనం ఎదుర్కోకూడదనే జిల్లాలోని ఐఎంఏ సహకారంతో గుండే పరీక్షలను నిర్వహించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు.  ఇందులో మొదట హర్ట్ స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని వచ్చే రీపోర్టుల అదారంగా అవసరాన్ని బట్టి ఈసిజి, 2 డి ఎకో వంటి పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని,  సమస్యలను బట్టి కొన్ని రకాల మందులను పూర్తి ఉచితంగా అందివ్వడం జరుగుతుందని తెలిపారు.  మొదటి విడతలో కళాశాల స్థాయి విద్యార్థులకు,  ఆ తరువాత వాకింగ్ కేంద్రాలు, జనసముహ ప్రాంతాలు,  ప్రదాన కూడళ్లలో మిగతావారికి పరీక్షలను నిర్వహించుకునేలా ప్రణాళికలను రూపొందించుకొవడం జరుగుతుందని తెలిపారు.  

  ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్, జట్పి చైర్మన్ కనుమల్ల విజయ, నగర మెయర్ వై. సునీల్ రావు,  మానకొండుర్ శాసన సభ్యులు రసమయి బాలకిషన్,  జిల్లా గ్రందాలయ సంస్థ చైర్మన్ పోన్న అన్నిల్ కుమార్ తదితరులు పాల్గోన్నారు.