బాలల హక్కులు, చట్టాలపై అవగాహన

బాలల హక్కులు, చట్టాలపై అవగాహన

ముద్ర,పానుగల్:-మహిళా,శిశు సంక్షేమ శాఖ వనపర్తి జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో సోమవారం పానుగల్ మండలం దావాజీపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేయుచున్న ఉపాధి హామీ కూలీలకు బాలల హక్కులు,రక్షణ చట్టాలు అంశాల పైన అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు.ఈకార్యక్రమనికి ముఖ్య అతిథిగా జిల్లా బాలల పరిరక్షణ అధికారి శ్రీ.M రాంబాబు హాజరై మాట్లాడారు.బాల్యవివహాల చెయ్యడం వల్ల ఎదురయ్యే పరిణామాలు గర్భస్రావం లేదా అబార్షన్ల ప్రమాదం,ఆర్ధిక భద్రత, సరైన విద్య లేకపోవడం,జన్యుపరంగ అసాధారణ పిల్లల జననాలను నిరోధించడానికి గల అంశం పైన అధిక ప్రమాదకర గర్భాల నివరించుట గురించి,పోషకాహారం,ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత,విద్య యొక్క ప్రాముఖ్యత ,వేసవి కాలంలో పిల్లల సంరక్షణ గురించి వివరించారు.ఆన్ లైన్ సైబర్ నెరలపైన,ఆన్ లైన్ భద్రత, పిల్లల భద్రత,మాధకద్రవ్యాల వినియోగాలు, మంచి స్పర్శ,చేడు స్పర్శ అత్యవసర సమయంలో ఉపయోగించవలసిన టోల్ ఫ్రీ నెంబర్లు 1098,112,181,100 నెంబర్లపైన అవగాహన కల్పించారు.

ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధి హామీ కూలీల అందరి దగ్గర పిల్లల రక్షణకు సంబంధించిన ప్రతిజ్ఞ చేయించారు.ఈ అవగాహన కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం నుండి శ్రీ M. నరేందర్ ,చైల్డ్ హెల్ప్ లైన్ కౌన్సిలర్ శ్రీ రాజేష్ కుమార్,దావాజీపల్లి గ్రామ పిల్డ్ అసిస్టెంట్ S. గోపాల్ గౌడ్,మహిళ సంఘల సభ్యులు,ఉపాధిహామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.