వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన

వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన

ముద్ర,పానుగల్:- వేసవికాలం నేపథ్యంలో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతతో గ్రామాలలో ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వనపర్తి జిల్లాఎయిడ్స్ లెప్రసీ టీబీ వ్యాధి నియంత్రణాధికారి డాక్టర్ వంశీకృష్ణ అవగాహన కల్పించారు.బుధవారం  ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ORS కార్నర్ ను,సౌకర్యాలను పరిశీలించి వైద్య ఆరోగ్యసిబ్బంది కి పలు సలహాలు,సూచనలు చేశారు.

వైద్య సిబ్బంది గ్రామాలను ఎప్పటికప్పుడు సందర్శించి వడదెబ్బ పైన ప్రజలను చైతన్య పరచాలని, ఎండాకాలంలో  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,తెల్లటి దుస్తులు ధరించాలని అత్యవసర సమయంలో బయటకు  వెళ్లవలసి వస్తే గొడుగులు పట్టుకుని వెళ్లేలా అవగాహన కల్పించాలన్నారు.నీళ్లు ఎక్కువగ త్రాగాలని ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఆరోగ్య కేంద్రానికి వచ్చేలా అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ఇటుక బట్టీల వద్ద అవసరమున్న వారికి ORS  ప్యాకెట్స్ఇచ్చి వడదెబ్బ పైన అవగాహన కల్పించారు.అన్నారం వెల్నెస్ సెంటర్ ను సందర్శించారు.కార్యక్రమం లో ఎపిడమాలజిస్ట్ డాక్టర్ జోషి, టీబీనోడల్ పర్సన్ బాసిత్ ఖాన్,కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రామయ్య  వైద్య సిబ్బంది పాల్గొన్నారు.