ఇంట్లో అగ్ని ప్రమాదాల నివారణకు అవగాహన సదస్సు

ఇంట్లో అగ్ని ప్రమాదాల నివారణకు అవగాహన సదస్సు

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని గోవిందపల్లి రోడ్డులో మాధవరావు రెసిడెన్షిలో ఇళ్ళలో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే వాటిని ఎలా ఎదుర్కోవాలి.. ఎలా నివారించాలి అనే అంశంఫై జగిత్యాల అగ్నిమాపక సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు.

ఇంట్లో గ్యాస్ ఎలక్ట్రికల్ ఫైర్ అయితే ఆర్పే పద్ధతుల గురించి వారికి వివరించారు. అలగే వేసవిలో అగ్ని ప్రమాదాలు సంబవించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి అగ్నిమాపక అధికారి జి .మధు, ఏ ఎల్ ఎఫ్ ప్రశాంత్, డ్రైవర్ ఆపరేటర్ ఎ. మల్లేశం, ఫైర్ మాన్లు నరేష్, వేణు తదితర సిబ్బంది పాల్గొన్నారు.