బీసీల రాజకీయ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి...  ధనుంజయ నాయుడు 

బీసీల రాజకీయ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి...  ధనుంజయ నాయుడు 

పాలకీడు, ముద్ర:-జనాభాలో 56శాతంగా  ఉన్న బీసీలకు చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా కమిటీ కన్వీనర్  ధూళిపాళ ధనుంజయ నాయుడు కోరారు.ఆదివారం  ఆయన పాలకీడు  మండల కేంద్రంలో బీసీ ముఖ్య నాయకులతో కలసి పాత్రికేయులతో మాట్లాడుతూ జనాభాలో 12 శాతం ఉన్న ఎస్సీలకు రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించారని, అలాగే గిరిజనులకు కూడా రాజకీయ రిజర్వేషన్ ఉన్నదని, మరి 56% గా ఉన్న బీసీలకు ఎందుకు చట్టబద్ధత కల్పించడం లేదని, ఆయన ప్రశ్నించారు.

కేవలం బీసీల మధ్య ఐక్యత లేకపోవడం వల్లనే ఇలా జరుగుతుందని, ఐక్యత ఎంతో అవసరం అనే విషయాన్ని బీసీలంతా గుర్తెరగాలని పిలుపునిచ్చారు.స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా అసెంబ్లీలలోను పార్లమెంట్లోనూ బీసీలకు ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ, రాజకీయ రిజర్వేషన్లకు చట్టబద్ధత సాధించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.ముఖ్యంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు అధికారంలో ఉన్న పాలకులకు బీసీల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేకపోవడం మరో కారణమని, బీసీలకు ఎన్నికల సందర్భంగా కొన్ని తాయిలాలు ప్రకటించి, వారికి కొన్ని భ్రమలు కల్పించి ఓట్లు వేసుకొని అధికారాన్ని అనుభవిస్తున్నారని ఇప్పటికైనా బీసీలు, కళ్ళు తెరవాలని, బీసీలకు పాలకులు చేస్తున్న మోసాలు గుర్తించి వారికి తగు గుణపాఠం నేర్పాలని, ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ జన గణన చేపట్టాలని నిర్ణయించడం హర్షించదగ్గ పరిణామం అని సాధ్యమైనంత తొందరగా బీసీ జన గణన  చేపట్టి ఏ కులం యొక్క జనాభా ఎంత ఉందో ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అంతే దామాషా  పద్ధతిలో అందించి బీసీల అభ్యున్నతికి ప్రభుత్వాలు తోడ్పడాలని ఆయన కోరారు.ఆయన వెంట బీసీ సంక్షేమ సంఘం పాలకీడు మండల అధ్యక్షుడు పేరూరి నాగయ్య, సంఘ నాయకులు రావుల సత్యం, బొల్లగాని సుబ్బు గౌడ్ ఉన్నారు