మెస్ చార్జీల పెంపుపై బీసీ సంఘాల హర్షం

మెస్ చార్జీల పెంపుపై బీసీ సంఘాల హర్షం

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ విద్యార్థుల మెస్ చార్జీలను పెంచడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కు, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ల కు బీసీ సంఘాల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులతో కలిసి స్వీట్ల పంపిణీ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది. బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేశిపెద్ది శ్రీధర్ రాజు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు ఉద్దేశించి శ్రీధర్ రాజు, బీసీ విద్యార్థి సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు రాజేష్ గౌడ్ మాట్లాడుతూ బీసీ సంఘాల సుదీర్ఘ పోరాటం తోనే మెస్ చార్జీలు పెరిగాయని వెనుకబడిన తరగతుల విద్యార్థుల సమస్యలను గ్రహించి ముఖ్యమంత్రి కేసీఆర్  మెస్ చార్జిల పెంపు నిర్ణయం తీసుకోవడం చాలా హర్షణీయం అన్నారు. బీసీ విద్యార్థులకు ఈ మెస్ చార్జీలతో పాటు కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని పాకెట్ మనీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగిందన్నారు. అలాగే బిసి సంక్షేమ వసతి గృహాలకు పక్కా భవనాలు నిర్మించాలని కోరడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ మియాపూర్ రవీంద్ర చారి, విద్యార్థులు శేఖర్, సాగర్, తిరుపతి, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.