బిసిలు కుల, చేతి వృత్తులవారు రూ. లక్ష అర్థిక సహాయం కోసం దరకాస్తు చేసుకోండి 

బిసిలు కుల, చేతి వృత్తులవారు రూ. లక్ష అర్థిక సహాయం కోసం దరకాస్తు చేసుకోండి 

జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సాయిబాబా 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము  వెనుకబడిన తరగతుల వర్గాల కులవృత్తులు, మరియు చేతి వృత్తులు వారికీ   రూపాయలు లక్ష ఆర్ధిక సహాయం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయించదని అర్హులు అయిన వారు ఆన్ లైన్ లో దరకాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సాయిబాబా ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్ధిక సహాయం దరఖాస్తు  కోసం బి.సి. కుల /చేతి వృత్తుల వారు ఆన్ లైన్ వెబ్ సైట్ tsobmmsbc.cgg.gov.in లో జూన్6 నుంచి జూన్ 20, 2023 వరకు  ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇందుకు  18 సం. నుండి 55 సం “ రాల లోపు వయస్సు,గ్రామీణ ప్రాంతాలలో రూ.1,50,000, వార్షిక ఆదాయం, పట్టణ ప్రాంతాలలో రూ.2,00,000, వార్షిక ఆదాయం కల్గిన కులవృత్తుల వారు అర్హులని తెలిపారు. గత 5 సంవత్సరములలోపు ఆర్ధిక సహాయం లబ్ది పొందినవారు అనర్హులని పేర్కొన్నారు. ఆన్ లైన్ లో కుల దృవీకరణ పత్రము , ఆదాయ దృవీకరణ పత్రము , ఆధార్ కార్డు, ఆహార భద్రత కార్డు , పాస్ పోర్ట్ సైజ్ ఫోటో  బ్యాంక్ పాస్ బుక్ జతచేయాలని సూచించారు.