ఆత్మగౌరవ పోరాటానికి బీసీలు సిద్ధం  కావాలి -  బీసీ నేత ధనుంజయ నాయుడు ఉద్ఘాటన 

ఆత్మగౌరవ పోరాటానికి బీసీలు సిద్ధం  కావాలి -  బీసీ నేత ధనుంజయ నాయుడు ఉద్ఘాటన 

చిలుకూరు, ముద్ర    :  గురువారం  చిలుకూరు మండల కేంద్రంలో బీసీ హక్కుల సాధన సమితి నాయకులతో కలిసి  విడుదల చేసిన పత్రిక ప్రకటన సందర్భంగా, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధూళిపాలి ధనుంజయ నాయుడు మాట్లాడుతూ,మనదేశంలో బీసీలకు తీరని అన్యాయం జరుగుతుందని విద్యా ఉద్యోగ ఉపాధి రంగాలతో పాటు రాజకీయ రిజర్వేషన్ల లోను జనాభా దామాషా పద్ధతిలో న్యాయం జరగడం లేదని బూర్జువా పార్టీలు బీసీలను కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా  చూస్తున్నారని, ఎమ్మెల్యేలుగా మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా ఉండాల్సిన బీసీలను ఎంపీటీసీ సర్పంచ్ పదవికి పరిమితం చేస్తున్నారని బీసీలు  ఆలోచన చేయాలని చైతన్యం కావాలని, పార్లమెంట్లో రాజకీయ రిజర్వేషన్ బిల్లు కొరకు ఐక్య ఉద్యమాలు నిర్మించాలని ఆయన కోరారు.

నూతనంగా ఏర్పడ్డతెలంగాణ ప్రభుత్వంబీసీ బిల్లు  రూపొందించి అమలు చేయాలని సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్న బీసీలను గుర్తించి వారికి తోడ్పాటు అందించడం ద్వారా సమాజం అభివృద్ధి చెందుతుందని జనాభాలో 56% గా ఉన్న బీసీలు అభివృద్ధి చెందకపోతే దేశం ఎలా అభివృద్ధి చెందుతుందని ఆయన ప్రశ్నించారు.బీసీల అభివృద్ధి కొరకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాలని కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని,బడ్జెట్లో బీసీలకు అధిక నిధులు కేటాయించాలని గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీసీ ఉద్యమాలు నిర్వహించడంద్వారా నేఇది సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లు చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియమించే నామినేటెడ్ పోస్టుల్లో కూడా బీసీలకు న్యాయం చేయాలని అన్ని కాంట్రాక్ట్ ల లో కూడా బీసీలకు 50% కేటాయించాలని స్వయం ఉపాధి కొరకు దరఖాస్తు చేసుకున్న బీసీ యువతకు బ్యాంకులతో సంబంధం లేకుండా రుణసదుపాయాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు,ఆయన వెంట బీసీ హక్కుల సాధన సమితి నాయకులు భాదే నర్సయ్య, రామిశెట్టి కోటయ్య ఉన్నారు,