బీజేపీని గెలిపిస్తే మరింత సంక్షేమం - బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి

బీజేపీని గెలిపిస్తే మరింత సంక్షేమం - బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్:ఈ నెల 13న జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా రంగంలో ఉన్న గేడం నగేష్ ను గెలిపించాలని, మోది ప్రభుత్వం మరో సారి కొనసాగితే సంక్షేమ పథకాలు పొందవచ్చని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. సారంగాపూర్ మండలంలోని జామ్, చించోలి తదితర గ్రామాల్లో ఆయన సోమవారం పర్యటించారు. ఈ క్రమంలో ఉపాధి హామీ కూలీలను కలిశారు. వారితో మాట్లాడుతూ బిజెపి ప్రజల శ్రేయస్సు కోరే పార్టీ అన్నారు. మోదీ ప్రభుత్వ హయంలో చేపట్టిన పలు పథకాలు ప్రజలకు అందుతున్నాయని, వాటి ఫలాలు పొందుతున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో  కూడా పార్టీకి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.