మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బీజేఎల్పి నేత ఏలేటి
ముద్ర ప్రతినిధి, నిర్మల్: తెలంగాణ పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వివిధ పార్టీల నేతలు మహారాష్ట్రకు చేరుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కిన్వట్ అసెంబ్లీ నియోజక వర్గ బీజేపీ అభ్యర్థి భీంరావ్ కేరాం కు మద్దతుగా తెలంగాణ బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎంఎల్ఏ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అప్పారావు పేట్ లో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, నిర్మల్ జిల్లా బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.