గడపగడపకు బిజెపి

గడపగడపకు బిజెపి

రామకృష్ణాపూర్,ముద్ర : కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 9 సంవత్సరాల సుపరిపాలనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సాధించిన అభివృద్ధి,సంక్షేమ పథకాలను శుక్రవారం రామకృష్ణాపూర్ పట్టణ ప్రజల్లోకి నాయకులు తీసుకెళ్లారు. ఈ సందర్బంగా ఆంధ్ర బ్యాంక్, తిలక్ నగర్ ప్రాంతాలలోని ప్రతి గడపకు నాయకులు తిరుగుతూ ప్రజలతో మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో బిజెపిని గెలిపిస్తే మరిన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మహంకాళి శ్రీనివాస్,జిల్లా ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్, మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆరుముళ్ల పోషం, సీనియర్ నాయకులు వేముల అశోక్,రమేష్,ప్రసాద్,తిరుపతి తదితరులు పాల్గొన్నారు.