బీడీ పరిశ్రమలను దెబ్బతీసే కుట్రలో బిజెపి కాంగ్రెస్

బిఆర్ఎస్ అధికారంలోకి రాగానే 3016 రూపాయల పెన్షన్ అమలు  - బి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్

ముద్ర, తంగళ్ళపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని బీడీ కార్ఖానాలో జరిగిన కార్యక్రమంలో బి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ,బిజెపి ప్రభుత్వాలు బీడీ పరిశ్రమలను గతంలో దెబ్బతీశాయని,బీడీ కట్టలపై 85% పుర్రె ఎముకలు  డేంజర్ గుర్తులు ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన ఆంక్షల వల్ల బీడీ పరిశ్రమ తీవ్రంగా దెబ్బ తిన్నదన్నారు.ములిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా  బిజెపి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీడీ పరిశ్రమపై జిఎస్టి విధించడం, బహిరంగ ప్రదేశాల్లో బీడీ తాగవద్దని పాన్ టేలలలో కిరణం షాపుల్లో బహిరంగంగా బీడీలు అమ్మవద్దని అనేక ఆంక్షలు వల్ల బీడీ పరిశ్రమ రోజురోజుకు
తగ్గు ముఖం పట్టడంతో దీనిపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది బీడీ కార్మికులు రోడ్డుపాలు కావడం జరిగిందన్నారు. 

కానీ తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్  ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత బీడీ కార్మికుల స్థితిగతులు తెలుసుకొని బీడీ కార్మికులకు, టేకేదారులకు 2016 రూపాయల జీవన భృతి కల్పించారని తెలిపారు. బీడీ కార్మికులందరకి అధికారంలోకి రాగానే పీఎఫ్ కలిగిన ప్రతి కార్మికురాలికి జీవన భృతి 3016 అందిస్తామని కెసిఆర్  కోరుట్ల బహిరంగ సభలో ప్రకటించడం జరిగిందన్నారు. బిడి కార్మికులందరు కారు గుర్తుకు ఓటు వేసి బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో వంగపల్లి మల్లేశం,నాంపల్లి సంజీవ్, చౌటపల్లి కుమార్, కనకయ్య, శేఖర్,పద్మ,సునీత, రమ తదితరులు పాల్గొన్నారు.