భారీ ర్యాలీ తో  నామినేషన్ వేసిన బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్

భారీ ర్యాలీ తో  నామినేషన్ వేసిన బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్
  • పాల్గొన్న బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి:- మహేశ్వరం బీజేపీ అభ్యర్థిగా అందెల శ్రీరాములు యాదవ్ గురువారం నామినేషన్ వేశారు. కర్మన్‌ఘాట్‌లో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. కర్మన్‌ఘాట్‌, బాలాపూర్‌లో మీరు నిర్వహించిన భారీ ర్యాలీలో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌ పాల్గొన్నారు.ఈ కార్యక్రమములో రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి,  ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి సహా ప్రజాప్రతినిధులు, బీజేపీ, కమలదళ సైన్యం తోడు నడవగా అందెల శ్రీరాములు ర్యాలీ గా వెళ్లి నామినేషన్ వేసారు.