ఆదరించండి...అండగా ఉంటా...

ఆదరించండి...అండగా ఉంటా...
  • బిజెపి అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్:రాబోయే ఎన్నికల్లో తనకు ఓటువేసి గెలిపించాలని, నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని బిజెపి అభ్యర్థి ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్మల్ డిగ్రీ కళాశాల మైదానంలో ఉదయపు నడక నిమిత్తం వచ్చిన ఉద్యోగులు, యువత తో  ఆయన  శుక్రవారం కలిసి నడిచారు. నియోజకవర్గం సమస్యలను వారితో చర్చించారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.