మంటల్లో కాలిన బెంగళూరు మెట్రోపాలిటన్ బస్సు

మంటల్లో కాలిన బెంగళూరు మెట్రోపాలిటన్ బస్సు

Bagalore:  బెంగ‌ళూరులోని ఎంజి రోడ్‌లోని అనిల్ కుంబ్లే సర్కిల్ వద్ద ఉదయం 9 గంటల ప్రాంతంలో బెంగుళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (BMTC) బస్సు (రూట్ 144E) మంటల్లో చిక్కుకుంది. బస్సు ఇంజిన్‌లో మొదట మంటలు కనిపించాయి. దీన్ని వెంటనే గుర్తించిన ప్రయాణికులంతా దిగిపోయారు. నడిరోడ్లోనే బస్సు తగలబడింది. ప్రమాదం జరిగే సమయానికి బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇంజిన్ లో మంటలు గమనించిన వెంటనే డ్రైవర్ అప్రమత్తమై ఇంజిన్ ను ఆపు చేశారు. ప్రయాణికులందర్నీ కిందికి దించేశారు. దీంతో ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్నిమాపక శకటాలు మంటలను ఆర్పాయి.  BMTC ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఈ ప్రమాదానికి గల కారణాలు తెలుసుకొనేందుకు విచారణ చేస్తున్నారు.