బిఆర్ఎస్ పథకాలను వివరిస్తూ ముందుకు సాగాలి

బిఆర్ఎస్ పథకాలను వివరిస్తూ ముందుకు సాగాలి
  • బీఆర్ఎస్ నియోజకవర్గ సమన్వయ కర్త రామకిషన్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఎన్నికల్లో ఓడినంత మాత్రాన పరిస్థితి చేజారలేదని, సమన్వయంతో పనిచేయాలని బి ఆర్ ఎస్ నిర్మల్ నియోజకవర్గ సమన్వయకర్త కె రాం కిషన్ రెడ్డి అన్నారు. నియోజకవర్గ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్మల్ లో సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్నో సంక్షేమ పథకాలు కొనసాగించినా వాటిని ఇంటింటికీ తీసుకెళ్ళటంలో విఫలం అయిన కారణంగానే గత ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చాయన్నారు. ఇప్పటికైనా కలిసికట్టుగా కృషి చేస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న, నిర్మల్ నాయకులు మారుగొండ రాము, డాక్టర్ సుభాష్ రావు తదితరులు ఉన్నారు.