సంక్షేమ పథకాలు అందించడంలో విఫలమైన బిఆర్ఎస్ ప్రభుత్వం

సంక్షేమ పథకాలు అందించడంలో విఫలమైన బిఆర్ఎస్ ప్రభుత్వం

వలిగొండ (ముద్ర న్యూస్): తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలకు, బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు దళిత బంధు, బీసీ బందు, గృహలక్ష్మి  ఈ పథకాలు అందించడంలో  బిఆర్ఎస్  ప్రభుత్వం విఫలమైనది అంటూ వలిగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ  కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి ఇంటి స్థలం తో పాటు ఇల్లు కూడా ఇందిరమ్మ పథకం ద్వారా నిర్మించి ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే  చెందినది అని అన్నారు. ఈ ప్రభుత్వం అర్హులైన  నిరుపేదలకు కాకుండా, పార్టీ కార్యకర్తలకు బంధుమిత్రులకు మాత్రమే కేటాయిస్తున్నారు. వలిగొండ పట్టణ కేంద్రంలో 10,000 పైచిలుకు జనాభా  ఏడు వేల పైన జనాభా గల పట్టణ కేంద్రానికి సుమారు 250 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. దానిలో దాంట్లో 150 సెలక్షన్ చేసి 35 గృహలక్ష్మి ఇళ్లను కేటాయించడం సిగ్గుచేటని, మొదటి విడతలో కనీసం 100 ఇల్లు అయిన ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పాశం సత్తిరెడ్డి, కంకల కిష్టయ్య, బోళ్ళ  శ్రీనివాస్, ఉలిపె మల్లేషం, పబ్బు సురేందర్, మైసొల్ల లక్ష్మి నర్సు, మారగొని నరసింహ, గంజి నారాయణ , రాపోలు శ్రీనివాస్, ఎండి గౌస్, శనిగారపు పాండు, మల్లం వెంకటేష్, ఇతపు నర్సిహ్మ, బత్తిని రవీందర్, మలుగ నాగులు, దండ మల్లికార్జున్, గోగికారి వేణు, మైసోల్ల వెంకటేష్, సందాని ,షర్ఫుద్దీన్, బత్తిని వెంకటేష్, ఎదురుగట్ల నరసింహ, బూడిద నర్సింహా, పొలేపాక నర్సింహా, జనగాం దశరథ  పర్వతంసాయిలు, పోలెపాక నర్సింహా, మహేష్, నరేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.