కాంగ్రెస్, బీజేపీ మోసపూరిత మాటలు నమ్మొద్దు

కాంగ్రెస్, బీజేపీ మోసపూరిత మాటలు నమ్మొద్దు
  • అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి
  • ప్రజా సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం

ముద్ర, షాద్‌నగర్:-కాంగ్రెస్, బీజేపీ మోసపూరిత మాటలు నమ్మొద్దని, అభివృద్ధిని చూసి బీఆర్‌ఎస్‌ని గెలిపించాలని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి అంజయ్య యాదవ్‌ పేర్కొన్నారు.ప్రజా సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం అని ఆయన పేర్కొన్నారు.బుధవారం షాద్‌నగర్ జిల్లా లోని వెంకీర్యాల, లక్ష్మిదేవిపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు...

ఎమ్మెల్యేగా అంజయ్య  యాదవ్ గారు గెలుపొందిన నాటి నుండి వెంకీర్యాల, లక్ష్మిదేవిపల్లి గ్రామాల్లో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించారు. లక్ష్మిదేవిపల్లి నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు. రూ.1.20 కోట్లతో సి.సి రోడ్డు నిర్మాణం పనులు, అంతర్గత మురుగు కాలువలు, ఆసరా పింఛన్ ధ్వారా ప్రతి నెల 151 మందికి 3.60 లక్షల రూపాయలు వస్తున్నాయి,  రైతు బంధు లబ్ధిదారులు 774 మంది, 9.87కోట్లు  రైతు రుణమాఫీ లబ్ధిదారులు 686 మంది, 3.92కోట్లు,  రైతు భీమా లబ్ధిదారులు 20 మంది, 100 లక్షలు,  కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ లబ్ధిదారులు 32 మంది, 32.10 లక్షలు, వెంకీర్యాల నుండి లక్ష్మిదేవిపల్లి వరకు 80 లక్షలతో రోడ్డు, వెంకీర్యాల నుండి పాత అగిర్యాల వరకు 2.50 కోట్లతో రోడ్డు మరమ్మత్తులు. అయ్యవారిపల్లి నుండి ముష్టిపల్లి వరకు 10.70 కోట్లతో రోడ్,  మిషన్ కాకతీయ ద్వారా 22.90 లక్షలతో కోనరాజు కుంట, 12.68లక్షలతో కొత్తకుంట, 12.35 లక్షలతో తిమ్మరెడ్డి కుంట చెరువుల పూడికతీత, చింతల వెంకటేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి 50లక్షలు అందించనట్లు ఆయన తెలియపరు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన కారుగుర్తు పార్టీకి అండగా ఉంటూ కారుగుర్తుకు ఓటు వేసి మరొక్కసారి ఆశీర్వదించాలి, అభివృద్ధిని కొనసాగిద్దామని ఈ సందర్భంగా ప్రజలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్  కోరారు.