తండ్రి పేరు పెట్టుకున్న కార్యకర్త కష్టాలు తీర్చనివాడు శ్రీధర్ బాబు

తండ్రి పేరు పెట్టుకున్న కార్యకర్త కష్టాలు తీర్చనివాడు శ్రీధర్ బాబు
  • మంథనిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధు

ముద్ర ప్రతినిధి పెద్దపల్లి: తన తండ్రి పేరు పెట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్త కష్టాల్లో ఉన్న వారి కష్టాలు తీర్చనివాడు ఈ మంత్రి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధు అన్నారు.  ఆదివారం మంథని లో ఎంపిపి జక్కుల ముత్తయ్య అధ్వర్యంలో సీతంపేట గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రావుల రాజ్ కుమార్, లింగం శ్రీనివాస్, రావుల కుమార్ లు బీఆర్ఎస్ పార్టీ లో చేరగా, పార్టీలో చేరిన వారికి పుట్ట మధు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పుట్ట మధు మాట్లాడుతూ నమ్ముకున్నోళ్లను నట్టేట్ల ముంచే నైజం మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబుది  అన్నారు. కార్యకర్తలను పట్టించుకోని శ్రీధర్ బాబును ఈ ఎన్నికల్లో ప్రజలు ఓడించాలన్నారు. లింగం శ్రీనివాస్ తనయుడికి శ్రీపాధ అని పేరు తన కుమారునికి పెట్టుకోగా వారిని కి ఎన్ని కష్టాలు వచ్చినా శ్రీధర్ బాబు పట్టించుకోలేదని పుట్ట మధు శ్రీధర్ బాబు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. లింగం శ్రీనివాస్  మాట్లాడుతూ శ్రీధర్ బాబు కోసం తాను మొదటినుంచి ఎంతో కష్టపడ్డానని నా కుమారునికి వారి తండ్రి పేరు పెట్టుకున్నామని మాకు ఎన్ని కష్టాలు వచ్చినా శ్రీధర్ బాబు పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఆకర్షితుడై మంథని ప్రాంతం అభివృధ్ది చెందాలంటే అది పుట్ట మధు తోనే సాధ్యమని పార్టీ లో చేరుతున్నట్లు శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి తోపాటు, గ్రామ అధ్యక్షుడు కూరాకుల సమ్మయ్య, ఉపసర్పంచ్ ఓదెలు, యూత్ నాయకులు నరేష్, మాజీ అధ్యక్షులు మల్లేష్, కుమారస్వామి, రాయ మల్లు పాల్గొన్నారు.