అమలు కానీ హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్

అమలు కానీ హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్
  • ఆశయానికి,అహంకారానికి జరుగుతున్న పోరాటమే పార్లమెంటు ఎన్నికలు
  • అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా బిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది
  • బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి RS ప్రవీణ్ కుమార్,మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి

ముద్ర,పానుగల్ :- ఆరు గ్యారంటీలని అమలుకు నోచుకోని వాగ్దానాలను చేసి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కినది కాంగ్రెస్ పార్టీ అని నాగర్ కర్నూల్ టిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్,కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి లు అన్నారు. శుక్రవారం రాత్రి మండల కేంద్రంలో బైక్ ర్యాలీతోపాటు రోడ్ షో నిర్వహించి ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు.అధికారం కోసం పరితపించే నాయకుడు కావాలా...ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడే నాయకుడు కావాలా ప్రజలు ఆలోచించుకోవాలని అన్నారు.ప్రజా గొంతుక ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ అని,ప్రజా సేవ కోసం ఉన్నత పోలీస్ ఉద్యోగాన్ని వదులుకొని వచ్చారని బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు.అభివృద్ధి,సంక్షేమమే లక్ష్యంగా బిఆర్ఎస్ ప్రభుత్వం పని చేసిందన్నారు.అహంకరానికిఆశయానికి జరుగుతున్న పోరాటం పార్లమెంట్ ఎన్నికలు అని, అబద్దాల నిచ్చెన మెట్లు ఎక్కిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని వారన్నారు.బిఆర్ఎస్ కార్యకర్తలపై పోలీస్ కేసులు పెడుతున్నారని విమర్శించారు.భయపడితే బానిసలు అవుతామ్...తెగబడితే తాటి కాయలు అవుతామని, ఎవరు భయపడాల్సిన పనిలేదని  ఎదురొడ్డి పోరాడాలని పిలుపునిచ్చారు.

స్థానికేతరుడైన మల్లు రవి కాదని,ముళ్ళు రవి అని అలాంటి వ్యక్తికి మంత్రి జూపల్లి మద్దతు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. బిజెపి ఎంపీ అభ్యర్థి తండ్రి రాములు పార్లమెంటులో మాట్లాడే అవకాశం ఉన్న మిన్నకుండి  పోయారని విమర్శించారు. అలాంటి వ్యక్తి పార్టీకి వెన్నుపోటు పొడిచి బిజెపి పార్టీలో చేరారని ఆరోపించారు.సమస్యలపై మాట్లాడే అవకాశం ఉన్న మాట్లాడలేని వ్యక్తికి తిరిగి ఎలా ఓట్లు వేసి గెలిపించాలని ప్రశ్నించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఆంజనేయులు గౌడ్,రంగీనేని అభిలాష్ రావు,ఎంపీపీ శ్రీధర్ రెడ్డి,బిఆర్ఎస్ పార్టీ ఎస్టి సెల్ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ నాయక్,అడ్వకేట్ రవికుమార్,వెంకటయ్య నాయుడు,వీర సాగర్,గోపాల్ రెడ్డి, సంగనమోని శేఖర్,దామోదర్ రెడ్డి, వివిధ గ్రామాల ఎంపీటీసీలు,మాజీ సర్పంచులు,బిఆర్ఎస్ పార్టీ గ్రామాల అధ్యక్షులు, గ్రామాల ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.