మంత్రి జూపల్లి సమక్షంలో బిఆర్ఎస్ ఎంపీటీసీలు కాంగ్రెస్ లో చేరిక

మంత్రి జూపల్లి సమక్షంలో బిఆర్ఎస్ ఎంపీటీసీలు కాంగ్రెస్ లో చేరిక

ముద్ర,పానుగల్:-పానుగల్ మండలంలోని బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీటీసీలు రాష్ట్ర ఎక్సైజ్,పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పానుగల్ మండలంలోని కదిరేపాడు, శాగాపూర్, కేతేపల్లి, చింతకుంట, దావాజిపల్లి గ్రామాల ఎంపీటీసీలు వీరపాగ నాగమ్మ, సుబ్బయ్య యాదవ్, తలకంటి శ్యామల హనుమంతు రెడ్డి, రమాదేవి రవీందర్ గౌడ్, లక్ష్మీ ఠాగూర్ నాయక్ లు కాంగ్రెస్ పార్టీలో చేరారు.పార్టీలో చేరిన ఎంపీటీసీలకు మంత్రి జూపల్లి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల, ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.